News March 25, 2024

హైదరాబాద్‌లో మరో 5 IPL మ్యాచులు

image

ఐపీఎల్ 2024 ఫుల్ షెడ్యూల్ వచ్చేసింది. ఇప్పటికే రెండు మ్యాచులు HYDలో ఖరారు కాగా, రెండో షెడ్యూల్‌లో మరో ఐదు మ్యాచులు జరగనున్నాయి. ఏప్రిల్ 25న ఆర్సీబీ, మే 2న రాజస్థాన్‌, 8న LSG, 16న గుజరాత్‌, 19న పంజాబ్‌తో SRH తలపడనుంది. తొలి షెడ్యూల్‌లో ఉప్పల్ వేదికగా ఈ నెల 27న ముంబై, ఏప్రిల్ 5న సీఎస్కేతో SRH తలపడనున్న సంగతి తెలిసిందే. వైజాగ్ వేదికగా మార్చి 31, ఏప్రిల్ 3న రెండు మ్యాచులు జరగనున్నాయి.

Similar News

News January 6, 2026

రష్యా లేకుంటే గయానా.. భారత్ తగ్గేదే లే!

image

రష్యా నుంచి భారత్ ఆయిల్ <<18775987>>దిగుమతులు<<>> తగ్గించుకున్నా పెద్దగా ఇబ్బంది లేదని విశ్లేషకులు చెబుతున్నారు. దక్షిణ అమెరికా దేశమైన గయానా నుంచి గతేడాది NOVలో 4 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ ఉన్న భారీ ఓడలు ఇండియాకు బయల్దేరాయి. ఈ నెలలో ఆ ఆయిల్ మన దేశానికి చేరుకోనుంది. అటు తమ దేశంలోని చమురు బావులను తవ్వుకోవచ్చని గయానా మన దేశానికి ఆఫర్ ఇచ్చింది. దీర్ఘకాలంలో ఇవి ఇండియాకు ఎంతో మేలు చేయనున్నాయి.

News January 6, 2026

Op Sindoor దెబ్బ.. US చుట్టూ తిరిగిన పాక్!

image

ఇండియా చేపట్టిన <<16441544>>ఆపరేషన్ సిందూర్‌<<>>కు భయపడి పాకిస్థాన్ అమెరికా సాయం కోరిన విషయం తాజాగా వెల్లడైంది. దాడులు ఆపేలా USతో లాబీయింగ్ చేసేందుకు పాక్ తీవ్రంగా ప్రయత్నించింది. US అధికారులు, చట్టసభ్యులు, మీడియా సంస్థలతో పాక్ రాయబారులు, రక్షణ అధికారులు 50పైగా మీటింగ్స్ నిర్వహించినట్లు తెలిసిందని NDTV వెల్లడించింది. ఆ తర్వాతే పలు ఒప్పందాలు, ట్రంప్-మునీర్ భేటీ వంటివి జరిగాయని తెలిపింది.

News January 6, 2026

శ్రీవారి ఆస్తులపై పక్కా లెక్కలుండాలి: TTD EO

image

AP: తిరుమల వేంకన్న భూములు, స్థలాలు, ఇతర ఆస్తులపై నిపుణుల సహకారంతో కచ్చితమైన లెక్కలను రూపొందించాలని TTD EO సింఘాల్ అధికారులను ఆదేశించారు. ‘టీటీడీ కళ్యాణ మండపాల స్థితిగతులపైనా సమీక్షించి సౌకర్యాలు మెరుగుపర్చాలి. సంస్థ ఆలయాలలోని తిరువాభరణ రిజిస్టర్లను డిజిటలైజ్ చేయాలి. ఆలయాలు, వసతి గృహాలలో పనిచేస్తున్న కార్మికులకు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమల్లోకి తేవాలి’ అని ఈవో సూచించారు.