News May 13, 2024
@5 PM: కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్ ఓటింగ్ 67.67%
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు సాయంత్రం 5 గంటల వరకు ఇలా ఉన్నాయి. చొప్పదండి- 70.13%, హుస్నాబాద్- 73.63%, హుజూరాబాద్-68.67%, కరీంనగర్-55.82%, మానకొండూర్-71.11%, సిరిసిల్ల-69.58%, వేములవాడ-71.26 శాతంగా ఉన్నాయి. మొత్తం పోలింగ్ 67.67% నమోదైంది.
Similar News
News January 22, 2025
సిరిసిల్ల: ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తులు సమర్పించని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు SRCL కలెక్టర్ సందీప్ కుమార్ తెలిపారు. రుద్రంగి గ్రామసభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మండల కేంద్రంలో ప్రాథమికంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా క్రింద 103, రైతు భరోసా కింద 1927, నూతన రేషన్‌కార్డుల కోసం 802, ఇందిరమ్మ ఇండ్ల కోసం 1375 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు.
News January 22, 2025
కరీంనగర్: ఆడపిల్లను ప్రోత్సహించాలి: కలెక్టర్
ఆడపిల్లను ప్రోత్సహించాలని, బాలికను సమాజంలో ఎదగనివ్వాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బేటీ బచావో-బేటి పడావో కార్యక్రమం ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్బస్టాండ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లలను రక్షించాలని ప్రతిజ్ఞ చేశారు.
News January 22, 2025
UPL లిమిటెడ్ సీఈఓతో మంత్రి శ్రీధర్ బాబు సమావేశం
దావోస్ పర్యటనలో భాగంగా UPL లిమిటెడ్ ప్రైవేట్ కంపెనీ CEO జైదేవ్ శ్రాఫ్‌తో మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. తెలంగాణలో అత్యాధునిక R&D సెంటర్, సీడ్ హబ్ ఏర్పాటు చేయడం గురించి చర్చించినట్లు ఆయన తెలిపారు. ఈ కంపెనీ భాగస్వామ్యంతో దీర్ఘకాలిక వ్యవసాయాభివృద్ధిని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.