News May 13, 2024

@5 PM: కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ 67.67%

image

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు సాయంత్రం 5 గంటల వరకు ఇలా ఉన్నాయి. చొప్పదండి- 70.13%, హుస్నాబాద్- 73.63%, హుజూరాబాద్-68.67%, కరీంనగర్-55.82%, మానకొండూర్-71.11%, సిరిసిల్ల-69.58%, వేములవాడ-71.26 శాతంగా ఉన్నాయి. మొత్తం పోలింగ్ 67.67% నమోదైంది.

Similar News

News January 22, 2025

UPL లిమిటెడ్ సీఈఓతో మంత్రి శ్రీధర్ బాబు సమావేశం

image

దావోస్ పర్యటనలో భాగంగా UPL లిమిటెడ్ ప్రైవేట్ కంపెనీ CEO జైదేవ్ శ్రాఫ్‌తో మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. తెలంగాణలో అత్యాధునిక R&D సెంటర్, సీడ్ హబ్ ఏర్పాటు చేయడం గురించి చర్చించినట్లు ఆయన తెలిపారు. ఈ కంపెనీ భాగస్వామ్యంతో దీర్ఘకాలిక వ్యవసాయాభివృద్ధిని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

News January 22, 2025

వేములవాడ రాజన్న ఆలయంలో ఆన్‌లైన్ సేవలు ప్రారంభం

image

దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యం కోసం ఆన్‌లైన్ సేవలను ఆలయ కార్యనిర్వాహణ అధికారి కొప్పుల వినోద్ రెడ్డి ప్రారంభించారు. ఆలయంలో ప్రతిరోజు జరిగే వివిధ పూజలు, అలాగే వసతి గదిలో వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచిట్లు ఆయన తెలిపారు. https://vemulawadatemple.telangana .gov.in/ అనే వెబ్ సైట్‌లో ఉంచినట్లు తెలిపారు.

News January 22, 2025

నేడు ఉమ్మడి జిల్లాలో ఇద్దరు మంత్రుల పర్యటన

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన గ్రామసభ కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఇద్దరు మంత్రులు జిల్లాకు రానున్నారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ రానున్నారు. రేణిగుంట, నారాయణపూర్, రుద్రంగి, జైన గ్రామాలలో జరిగే గ్రామసభలో పాల్గొంటారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.