News July 22, 2024

ప్రత్యేక హోదాకు 5 అర్హతలు, APకి రానట్లేనా?

image

*పర్వతాలు, కఠినమైన భౌగోళిక స్వరూపం
*తక్కువ జనసాంద్రత, గిరిజన జనాభా అధికం
*పక్క దేశాలతో సరిహద్దు కలిగి ఉండడం.
*ఆర్థిక, పారిశ్రామిక వెనుకబాటుతనం
*రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండటం
>>నేషనల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ సూచించిన ఈ అర్హతలు ఉన్న రాష్ట్రాలకే ప్రత్యేక హోదా ఇస్తారు. తాజాగా బిహార్‌కు ఈ అర్హతల్లేవని కేంద్రం స్పష్టం చేసింది. దీని ప్రకారం ఏపీకి కూడా హోదా ఇచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది.

Similar News

News December 21, 2025

కేసీఆర్ వ్యాఖ్యలు 90శాతం అబద్ధం: ఉత్తమ్

image

TG: రాష్ట్రంలో ఇరిగేషన్‌ను నాశనం చేసింది కేసీఆరే అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలు 90శాతం అబద్ధమని చెప్పారు. ‘కృష్ణా జలాల విషయంలో మోసం చేసింది కేసీఆర్ ప్రభుత్వమే. కాళేశ్వరం తెలంగాణకు గుండెకాయ అన్నారు. రూ.1.80 లక్షల కోట్లతో కట్టిన ప్రాజెక్టు కూలింది. రైతులకు ఎలాంటి ప్రయోజనం జరగలేదు. ప్రజల భవిష్యత్తును గత ప్రభుత్వం తాకట్టు పెట్టింది’ అని ఫైరయ్యారు.

News December 21, 2025

ఇంట్లో ధనం నిలవడం కోసం పాటించాల్సిన వాస్తు నియమాలు

image

సంపద నిలవాలంటే ఇంట్లో శక్తి ప్రవాహం సరిగ్గా ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు కొన్ని టిప్స్ సూచిస్తున్నారు. ‘ప్రధాన ద్వారం వద్ద చెత్త ఉండొద్దు. శుభ్రంగా ఉంటేనే సానుకూలత పెరుగుతుంది. నీటి వృథా ధన నష్టానికి సంకేతం. లీకేజీలను అరికట్టాలి. పని ప్రదేశం అస్తవ్యస్తంగా ఉండొద్దు. వాయువ్యంలో శుభ్రం ముఖ్యం. ఇంట్లో అనవసరమైనవి ఉంచకూడదు. ఇల్లు పద్ధతిగా ఉంటేనే ఆర్థిక స్థితి బాగుంటుంది’అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News December 21, 2025

ఈ ఏడాదిలో నేడు అతిపెద్ద రాత్రి.. కారణమిదే!

image

ఈ ఏడాదిలో DEC 21న అతిపెద్ద రాత్రి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈరోజు రాత్రి సమయం 13.30 నుంచి 14 గంటలు ఉంటుంది. సూర్యుడి సదరన్ హెమీస్ఫియర్ (దక్షిణార్ధగోళం) జర్నీ నేటితో ముగిసి నార్తర్న్ హెమీస్ఫియర్‌(ఉత్తరార్ధగోళం)లో ప్రయాణం టెక్నికల్‌గా మొదలవుతుంది. ఈ సమయంలో సూర్యుడి నుంచి భూమి అత్యంత దూరంగా వెళుతుంది. భూమి ధ్రువం నుంచి 23.4 డిగ్రీల వంపులో ఉండటం వల్ల శీతాకాలపు అయనాంతం ఏర్పడుతుంది.