News February 1, 2025

₹4L-8L వరకు 5% పన్ను.. మరి ₹12.75Lకు జీరో ట్యాక్స్ ఎందుకంటే?

image

Income Taxలో వేర్వేరు శ్లాబులకు వేర్వేరు పన్ను రేట్లు ఉన్నప్పటికీ రూ.12.75లక్షల వరకు ఎందుకు ట్యాక్స్ ఉండదని చాలామందికి డౌట్. విషయం ఏంటంటే గతంలో రూ.7L వరకు రూ.75వేల స్టాండర్డ్ డిడక్షన్ (SD), రూ.25వేలు రిబేట్ ఉండేది. ఇప్పుడు SDను అంతే ఉంచి రిబేటును రూ.60వేలకు పెంచారు. అందుకే ఈ రెండూ కలుపుకొని రూ.12.75L వరకు ట్యాక్స్ ఉండదు. ఇంతకన్నా ఎక్కువ ఆదాయముంటే శ్లాబుల వారీగా లెక్కించి ఆ మేరకు పన్ను వేస్తారు.

Similar News

News February 18, 2025

అరెస్టు నుంచి యూట్యూబర్ రణ్‌వీర్‌కు రిలీఫ్

image

యూట్యూబర్ <<15499212>>రణ్‌వీర్<<>> అలహాబాదియ మాటలతో మన తల్లులు, ఆడపడుచులు, సమాజం తలదించుకుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే అరెస్టుల నుంచి రక్షణ కల్పించింది. ఇది ప్రజా కోర్టు కాదని, పౌరులు బెదిరించేందుకు, దోషిగా తేల్చేందుకు వీల్లేదని తెలిపింది. స్థానిక పోలీసుల వద్ద రక్షణ పొందొచ్చని సూచించింది. విచారణకు పూర్తిగా సహకరించాలని, పాస్‌పోర్టును ఇవ్వాలని ఆదేశించింది. ఇదే కేసులో ఇంకెక్కడా FIR నమోదు చేయొద్దంది.

News February 18, 2025

తండ్రి మృతి.. స్వదేశానికి మోర్కెల్

image

టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ తండ్రి మరణించారు. దీంతో ఆయన సౌతాఫ్రికాకు బయల్దేరివెళ్లారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు భారత జట్టుతో కలిసి దుబాయ్ వెళ్లిన మోర్కెల్ అక్కడి నుంచే స్వదేశానికి వెళ్లిపోయారు. అటు టోర్నీలో భాగంగా ఇండియా ఎల్లుండి బంగ్లాదేశ్‌తో తలపడనుంది. మోర్కెల్ ఎప్పుడు తిరిగి వస్తారనేదానిపై బీసీసీఐ త్వరలో ప్రకటన చేసే అవకాశం ఉంది.

News February 18, 2025

బూతులు మాట్లాడేందుకు లైసెన్స్ ఉందా: సుప్రీంకోర్టు ఆగ్రహం

image

పేరెంట్స్ సెక్స్‌పై వల్గర్ కామెంట్లు చేసిన <<15458454>>రణ్‌వీర్<<>> అలహాబాదియపై సుప్రీంకోర్టు విరుచుకుపడింది. ‘అతడు తల్లిదండ్రులను అవమానిస్తున్నాడు. అతడి బుర్రలోనే ఏదో బురద ఉంది. ఇలాంటి వ్యక్తికి మేమెందుకు ఫేవర్ చేయాలి? అతడి ప్రోగ్రాముల్లో అంతా అసభ్యతే కనిపిస్తోంది. ఇలాంటి చెత్త లాంగ్వేజ్ మాట్లాడేందుకు మీకేమైనా లైసెన్స్ ఉందా? పాపులారిటీ రాగానే ఏదైనా మాట్లాడొచ్చని భావిస్తున్నారు’ అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.

error: Content is protected !!