News November 29, 2024
సెంట్రల్ యూనివర్సిటీల్లో 5 వేల ఖాళీలు

కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 5 వేల టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్ర విద్యాశాఖ తెలిపింది. ఉద్యోగ విరమణ, రాజీనామాలు, అదనపు అవసరాల వల్ల ఈ ఖాళీలు ఏర్పడ్డాయని, అయితే ఖాళీల భర్తీ బాధ్యత ఆయా వర్సిటీలదే అని పేర్కొంది. ఎప్పటికప్పుడు ఉద్యోగాల భర్తీకి UGC 2023లో CU-Chayan Portalను ప్రవేశపెట్టిందన్నారు. విద్యార్హతల ఆధారంగా ఈ పోర్టల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. Share It.
Similar News
News November 20, 2025
ఢిల్లీ బ్లాస్ట్.. నలుగురు కీలక నిందితుల అరెస్ట్

ఢిల్లీ పేలుడు కేసులో మరో నలుగురు కీలక నిందితులను NIA అరెస్ట్ చేసింది. డా.ముజమ్మిల్ షకీల్(పుల్వామా), డా.అదీల్ అహ్మద్(అనంత్నాగ్), డా.షాహీన్ సయిద్(యూపీ), ముఫ్తీ ఇర్ఫాన్(J&K)ను పటియాలా కోర్టు ఆదేశాలతో కస్టడీలోకి తీసుకుంది. ఎర్రకోట పేలుడులో వీరు కీలకంగా వ్యవహరించినట్లు NIA గుర్తించింది. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఆరుకు చేరింది.
News November 20, 2025
త్వరలో రెస్టారెంట్లు, సొసైటీల్లో ఎంట్రీకి ఆధార్!

ఆధార్ విషయంలో త్వరలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రెస్టారెంట్లలో లైవ్ ఈవెంట్కు వెళ్లాలన్నా, హౌసింగ్ సొసైటీల్లోకి ఎంట్రీ కావాలన్నా, ఏదైనా ఎగ్జామ్ రాయాలన్నా మీ గుర్తింపు కోసం ఆధార్ చూపించాల్సి రావొచ్చు. ఆఫ్లైన్ ఆధార్ వాడకాన్ని పెంచాలనే ఉద్దేశంతో UIDAI ఈ తరహా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వ్యక్తుల ప్రైవసీకి కూడా ఇది ఉపయోగపడుతుందని ఆ సంస్థ చెబుతోంది.
News November 20, 2025
TMC-HBCHలో ఉద్యోగాలు

విశాఖపట్నంలోని <


