News September 30, 2025

5 సార్లు ఎంపీగా గెలిచిన మల్హోత్రా కన్నుమూత

image

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయ్ కుమార్ మల్హోత్రా (94) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. ఢిల్లీకి చెందిన ఆయన 5 సార్లు ఎంపీగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1999 ఎన్నికల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను భారీ తేడాతో ఓడించి సంచలనం సృష్టించారు. మల్హోత్రా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.

Similar News

News January 21, 2026

వేములవాడ : ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రికార్డులు స్వాధీనం చేసుకున్న విజిలెన్స్

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన రికార్డులను విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లడ్డు ప్రసాదాల తయారీ, విక్రయం, ఇతర విభాగాలలో 292 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉండగా వీరిలో 255 మంది మాత్రమే పని చేస్తున్నట్లు వారు గుర్తించారు. దీంతో అటెండెన్స్ రిజిస్టర్, వేతనాల చెల్లింపు వివరాల రికార్డులను వారు స్వాధీనం చేసుకున్నారు.

News January 21, 2026

నేటి ముఖ్యాంశాలు

image

* BJP జాతీయాధ్యక్షుడిగా నితిన్ నబీన్ ప్రమాణం
* నితిన్ నా బాస్.. నేను కార్యకర్తను మాత్రమే: మోదీ
* దావోస్‌లో గూగుల్ క్లౌడ్, IBM CEOలతో చంద్రబాబు భేటీ
* ఫోన్ ట్యాపింగ్‌ కేసులో 7 గంటలపాటు హరీశ్ రావును విచారించిన సిట్
* హరీశ్ విచారణపై INC-BRS నేతల మధ్య డైలాగ్ వార్
* పెండింగ్ చలాన్లపై బలవంతం చేయొద్దు: TG హైకోర్టు
* ఇవాళ రూ.22వేలు పెరిగిన కేజీ వెండి ధర, రూ.1.52లక్షలకు చేరిన 24క్యారెట్ల 10గ్రా. బంగారం

News January 21, 2026

మే నెలలో సముద్రంలోకి మత్స్య-6000

image

సముద్ర గర్భ రహస్యాల అన్వేషణలో భారత్ కీలక అడుగు వేయబోతుంది. ‘సముద్రయాన్’ ప్రాజెక్టులో భాగంగా చెన్నై NIOT కేంద్రంలో తయారైన నాలుగో తరం సబ్‌మెరైన్ ‘మత్స్య-6000’ను మే నెలలో సముద్రంలోకి ప్రవేశపెట్టనున్నారు. డీప్ ఓషియన్ మిషన్ (DOM) కింద రూపొందిన ఈ సబ్‌మెరైన్‌లో 500 మీటర్ల లోతు వరకు ముగ్గురు ఆక్వానాట్స్ ప్రయాణిస్తారు. ఈ ప్రయోగం విజయవంతమైతే US, రష్యా, చైనా, ఫ్రాన్స్, జపాన్ సరసన భారత్ నిలుస్తుంది.