News February 6, 2026

50ఏళ్ల తర్వాత మహిళలు ఇవి తినాలి

image

​ఆడవారిలో 50 సంవత్సరాలు దాటాక హార్మోనల్ చేంజెస్ వస్తాయి. దీంతో శక్తి తగ్గడం, జాయింట్ పెయిన్స్, కండరాలు దృఢంగా మారడం, మానసిక సమస్యలొస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే రోజూవారీ ఆహారంలో నువ్వులు, అవిసెగింజలు, బాదం పప్పులు తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటు ఎక్కువగా నీరు తాగడంతో పాటు చిన్న చిన్న వ్యాయామాలు చెయ్యడం మంచిదంటున్నారు.

Similar News

News February 19, 2026

మే తొలి వారంలో కవిత కొత్త పార్టీ!

image

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. మే నెల మొదటి వారంలో ముహూర్తం చూసుకొని ప్రకటించనున్నట్లు వెల్లడించారు. పార్టీ పేరులో తెలంగాణ ఉంటుందని చెప్పారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చని ఆమె పేర్కొన్నారు. మొదటి ఛాయిస్ సిద్దిపేట, రెండోది బోధన్ అని చెప్పారు.

News February 19, 2026

పంటల్లో చెదపురుగుల నివారణకు మరికొన్ని సూచనలు

image

పొలం గట్లపై ఉండే చెదపురుగుల స్థావరాలను గుర్తించి నాశనం చేయాలి. సరిగా కుళ్లని సేంద్రియ ఎరువు చెదపురుగులను ఆకర్షిస్తుంది. అందుకే బాగా కుళ్లిన సేంద్రియ పదార్థాన్నే ఎరువుగా వాడాలి. పంట విత్తేసమయంలో KG విత్తనానికి క్లోరిపైరిఫాస్ 6ml కలిపి విత్తనశుద్ధి చేస్తే విత్తనాలను చెద నుంచి కాపాడవచ్చు. చెరకు పంటలో చెదల నివారణకు లీటరు నీటికి మలాథియాన్ 2mlను కలిపి 15 నిమిషాల పాటు ఉంచి తర్వాత మొక్క మొదల్లో వేయాలి.

News February 19, 2026

ధ్యానంతో దైవ దర్శనం సాధ్యమని చెప్పిన మహర్షి

image

ఉపనిషత్తుల్లో పేర్కొన్నవారిలో ఆరుణి మహర్షి ఒకరు. ఆయన గొప్ప జ్ఞాని. ఆయన బోధనలు బృహదారణ్యక, ఛాందోగ్య ఉపనిషత్తులలో కనిపిస్తాయి. ఆయన ఆధ్యాత్మిక గురువు. ఈయన వద్దే సుప్రసిద్ధ యాజ్ఞవల్క్య మహర్షి విద్యను అభ్యసించారు. ఆత్మ, శరీరం, అంతరాత్మతో దేవుడిని తెలుసుకోవచ్చని శిష్యులకు వివరించేవారు. తన కుమారుడైన శ్వేతకేతువుకు తత్త్వమసి వంటి ఆధ్యాత్మిక రహస్యాలను బోధించి, ధ్యానంతో దైవదర్శనం కలిగించారు.