News July 22, 2024

50 లక్షల మొక్కలతో మెగా ప్లాంటేషన్: గుంటూరు కలెక్టర్

image

పచ్చదనాన్ని పెంచి వాతావరణ సమతౌల్యం సాధించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ నాగలక్ష్మీ ఆదేశించారు. ఇందుకోసం 50 లక్షల మొక్కలతో మెగా ప్లాంటేషన్ చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు లైన్ డిపార్ట్మెంట్ అధికారులు సమన్వయంతో కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. ప్రక్రియ
వారంలోపు పూర్తి కావాలన్నారు. మెగా ప్లాంటేషన్ నిర్వహణపై సోమవారం అధికారులతో సమీక్షించారు.

Similar News

News November 27, 2025

దుగ్గిరాల యార్డులో క్వింటాల్ పసుపు ఎంతంటే.!

image

దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం నిర్వహించిన వేలంలో పసుపు ధరలు నిలకడగా ఉన్నాయి. క్వింటాల్ పసుపు గరిష్ఠంగా రూ. 12,700 ధర పలికింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పసుపు కొమ్ముల ధర రూ. 9 వేల నుంచి రూ. 12,700 వరకు, కాయ రకం పసుపు ధర రూ. 9,300 నుంచి రూ. 12,190 వరకు పలికాయి. మార్కెట్‌లో మొత్తం మీద పసుపు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

News November 27, 2025

అమరావతి రైతులు ఆందోళన వద్దు: పెమ్మసాని

image

రాజధాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. త్రీ మ్యాన్ కమిటీ సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. అమరావతి సమస్యలకు పరిష్కారం చూపుతూనే, రాజధాని పనులు వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు. రాబోయే 6 నెలల్లో రాజధానికి అవసరమైన మౌలిక సదుపాయాలను పూర్తిచేసే దిశగా పటిష్ఠ చర్యలు తీసుకుంటామన్నారు. మరో 4 రోజుల్లో జరగబోయే 2వ సమావేశంలో రైతులకు పూర్తి వివరాలు చెప్తామన్నారు.

News November 27, 2025

విద్య వైద్యం ఇవ్వండి.. ఉచిత పథకాలు వద్దు: వెంకయ్య నాయుడు

image

తెనాలిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు ఉచిత పథకాలతో ప్రజలను సోమరి పోతులుగా తయారు చేస్తున్నాయని విమర్శించారు. విద్య, వైద్యం ఉచితంగా ఇస్తే చాలని, బస్సులు ఫ్రీగా ఇమ్మని ఎవరు అడిగారని ప్రశ్నించారు. సంపద సృష్టించాలి తప్ప అప్పులు చేయడం తప్పు అని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగులోనే పరిపాలన చేయాలని ముఖ్యమంత్రులను కోరారు.