News January 20, 2026
50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం: CBN

AP: టెక్నాలజీ సహా వివిధ రంగాల్లోని మార్పులకు అనుగుణంగా పాలసీలు రూపొందిస్తామని CBN పేర్కొన్నారు. ‘దావోస్ సదస్సులో ప్రముఖుల ఆలోచనలతో రాష్ట్రాన్ని బిజినెస్ ఫ్రెండ్లీగా మారుస్తాం. అగ్రి, మెడికల్ రంగాల్లో డ్రోన్లను వినియోగిస్తాం. 2026లో డ్రోన్ అంబులెన్స్ లాంచ్ చేసే ఆలోచన ఉంది. 50L ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేపట్టాలని లక్ష్యం పెట్టుకున్నాం’ అని దావోస్‌లో CII బ్రేక్ ఫాస్ట్ సెషన్‌లో CM పేర్కొన్నారు.
Similar News
News February 22, 2026
రేపు స్టాక్ మార్కెట్లపై వీటి ప్రభావం?

US-ఇరాన్ టెన్షన్స్, అమెరికా సుప్రీంకోర్టు టారిఫ్స్ రద్దు ప్రభావం రేపు దేశీయ స్టాక్ మార్కెట్లపై ఉండొచ్చని వాణిజ్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. US సుప్రీంకోర్టు తీర్పు, వెస్ట్ మార్కెట్లు శుక్రవారం పాజిటివ్‌గా క్లోజ్ అవడం సానుకూలంగా ఉంది. అయితే ఈనెల 24 నుంచి 15% టారిఫ్స్ అమలు కానున్నట్లు ట్రంప్ ప్రకటించడం, ముడి చమురు ధరలు పెరగడం, దేశీయ-విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, రూపీ పతనం ప్రతికూల అంశాలుగా ఉన్నాయి.
News February 22, 2026
SKY టెక్నిక్ ప్రమాదకరం: సంజయ్ మంజ్రేకర్

T20WC: బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ అనుసరిస్తున్న వ్యూహం ప్రమాదకరమని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ హెచ్చరించారు. USAతో మ్యాచ్‌లో వికెట్లు కాపాడేందుకు SKY ఆచితూచి ఆడటం కలిసొచ్చినా అన్ని మ్యాచ్‌ల్లో అదే ఫాలో కావడం సరికాదన్నారు. 200+ టార్గెట్ స్కోర్ చేసే సమర్థత జట్టుకు ఉందని.. లోయర్ ఆర్డర్‌లోని హిట్టర్లకు కూడా అవకాశం ఇవ్వాలన్నారు. దూకుడుగా ఆడి భారీ స్కోర్ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
News February 22, 2026
సకల దేవతా స్వరూపమే ‘గోమాత’

గోవు ప్రాణి మాత్రమే కాదు. ముక్కోటి దేవతల నిలయం. గోమాత శరీరంలోని ప్రతి భాగంలోనూ ఓ దేవత కొలువై ఉంటారు. ముఖం మధ్యలో శివుడు, కళ్లలో సూర్యచంద్రులు, చెవులలో అశ్వినీ దేవతలు, మెడ భాగంలో బ్రహ్మ, రాహు, కేతువులు, కాళ్లలో సరస్వతి, విష్ణుమూర్తి, విశ్వామిత్రుడు కొలువై ఉంటారు. ఉదరంలో భూమాత, తోకలో నాగరాజు, కొమ్ములలో ఇంద్రుడు నివసిస్తారు. అందుకే గోపూజ చేయడం వల్ల సకల దేవతలను ఆరాధించిన పుణ్యం లభిస్తుంది.


