News March 20, 2024
ఐపీఎల్ కోసం 50 ఫ్యాన్ పార్క్‌లు

ఐపీఎల్ సీజన్-17 కోసం దేశ వ్యాప్తంగా 50 ఫ్యాన్ పార్క్‌లు ఏర్పాటు చేయనున్నట్లు బీసీసీఐ తెలిపింది. మొదటి ఫ్యాన్ పార్క్‌ను ఈ నెల 22న మధురైలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. మొదటి రెండు వారాలకు దేశంలోని 11 రాష్ట్రాలను ఫ్యాన్ పార్కులకు వేదికలుగా ఎంపిక చేయగా ఆ జాబితాలో తెలంగాణ ఉండగా, ఏపీ లేదు. మార్చి 30, 31 తేదీల్లో నిజామాబాద్‌లో ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు.
Similar News
News January 17, 2026
లిక్కర్ కేసులో విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు

AP: లిక్కర్ స్కాం కేసులో YCP మాజీ MP విజయసాయిరెడ్డికి ED నోటీసులిచ్చింది. ఈ నెల 22న తమ ఎదుట హాజరుకావాలని పేర్కొంది. YCP హయాంలో అమలు చేసిన మద్యం విధానంలో అక్రమాలు జరిగాయని ED విచారణ జరుపుతోంది. ఆ టైమ్‌లో జగన్‌కు సన్నిహితంగా ఉన్న VSRకి నోటీసులివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. మద్యం సరఫరాదారులు, డిస్టిలరీల నుంచి ముడుపులు అందినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి.
News January 17, 2026
ఇంటి చిట్కాలు

* జిడ్డు పట్టిన గ్యాస్ లైటర్‌ను ఒక క్లాత్‌పై కాస్త లైజాల్, నిమ్మకాయ, బేకింగ్ సోడాతో తుడిస్తే గ్యాస్ లైటర్ మెరిసిపోతుంది.
* నెయిల్ పాలిష్ క్లీనర్‌తో తుడిస్తే ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డులపై మరకలు పోతాయి.
* ఒక కప్పు వేడి నీటిలో 2 చెంచాల వెనిగర్ వేసి బాగా కలిపి, వాషింగ్ మెషీన్ మరకలపై స్ప్రే చేసి కాసేపు అలాగే ఉంచాలి. తర్వాత క్లీనింగ్ బ్రష్‌తో శుభ్రం చేస్తే మరకలు ఈజీగా తొలగిపోతాయి.
News January 17, 2026
మొక్కజొన్నలో బొగ్గు కుళ్లు తెగులు – నివారణ

బొగ్గు కుళ్లు తెగులు ఎక్కువగా సోకే ప్రాంతాల్లో పంటవేసే ముందు పచ్చిరొట్ట పైరును సాగుచేసి నేలలో కలియదున్నాలి. ఎకరాకు అదనంగా 30 కిలోల పొటాష్‌ను ఇచ్చే ఎరువులను వేయాలి. ఎండాకాలంలో నేలను లోతుగా దున్నాలి. పంట వేసిన తర్వాత ముఖ్యంగా పూతదశ నుంచి నేలలో తేమ తగ్గకుండా నీటి తడులు పెట్టాలి. పంటకోసిన తర్వాత తెగులు సోకిన మొక్కల భాగాలను ఏరి కాల్చివేయాలి. పంటమార్పిడి పద్ధతిని అనుసరించాలి.


