News November 17, 2024
గ్రూప్-3 పరీక్షకు హాజరైంది 50శాతం మందే
తెలంగాణ వ్యాప్తంగా 1401 ఎగ్జామ్ సెంటర్లలో ఇవాళ జరిగిన గ్రూప్-3 పరీక్ష రాసేందుకు అభ్యర్థులు అంతగా ఆసక్తి చూపలేదు. 5.36 లక్షల మంది పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోగా, 76.4శాతం మంది హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ఉదయం పేపర్-1కు 2,73,847 మంది, పేపర్-2కు 2,72,173 మంది మాత్రమే హాజరైనట్లు TGPSC ప్రకటించింది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 64శాతం మంది పరీక్షకు హాజరయ్యారు.
Similar News
News November 18, 2024
నవంబర్ 18: చరిత్రలో ఈరోజు
1901: సినీ దర్శకుడు, నిర్మాత వి.శాంతారాం జననం
1962: భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత నీల్స్ బోర్ మరణం (ఫొటోలో)
1963: పుష్ బటన్ టెలిఫోన్ సేవలు ప్రారంభం
1984: నటి నయనతార జననం
1994: కథా రచయిత పూసపాటి కృష్ణంరాజు మరణం
News November 18, 2024
పాక్లో హిందువుల పరిస్థితి చూస్తే బాధేస్తుంది: పవన్
పాకిస్థాన్లో ఇద్దరు హిందూ బాలికలు అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటనపై ఏపీ Dy.CM పవన్ విచారం వ్యక్తం చేశారు. ఇస్లాంకోట్లో హేమ(15), వెంటి(17) చెట్టుకు ఉరివేసుకుని కనిపించారని ఓ నెటిజన్ చేసిన ట్వీట్పై ఆయన స్పందించారు. ‘పాక్లో హిందూ సోదరీమణులు ఇలాంటి దారుణాలకు బలవ్వడం చాలా బాధాకరం. PAK, BANలో హిందువుల దుస్థితిపై వార్తలు చూసిన ప్రతిసారీ నాకు చాలా బాధ కలుగుతుంది’ అని ట్వీట్ చేశారు.
News November 18, 2024
ఈరోజు నమాజ్ వేళలు
తేది: నవంబర్ 18, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 5:09
సూర్యోదయం: ఉదయం 6:23
దుహర్: మధ్యాహ్నం 12:01
అసర్: సాయంత్రం 4:04
మఘ్రిబ్: సాయంత్రం 5:40
ఇష: రాత్రి 6.55
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.