News February 23, 2025
మహా శివరాత్రి స్పెషల్ బస్సుల్లో 50 శాతం ఎక్స్‌ట్రా ఛార్జీ

TG: మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 24 నుంచి 28 వరకు 43 శైవ క్షేత్రాలకు 3 వేల స్పెషల్ బస్సులను నడుపుతామని TGSRTC వెల్లడించింది. వీటిలో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తామని, మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం ఉంటుందని తెలిపింది. శ్రీశైలం, వేములవాడ, ఏడుపాయల, కీసరగుట్ట, వేలాల, కాళేశ్వరం, కొమరవెల్లి, అలంపూర్, రామప్పకు ఈ బస్సులు వెళ్తాయని పేర్కొంది. రెగ్యులర్ బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయంది.
Similar News
News February 23, 2025
కొత్త రేషన్ కార్డులపై శుభవార్త

TG: మార్చి 1న కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 26న 16వేల కుటుంబాలకు కార్డులు ఇవ్వగా, మార్చి 1న ఎన్నికల కోడ్ లేని HYD, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పంపిణీ చేయనుంది. MAR 8 తర్వాత మిగతా జిల్లాల్లో జారీ చేయనున్నారు. ఏళ్లుగా రేషన్ కార్డుల పంపిణీ లేకపోవడంతో కొందరు 2-3సార్లు దరఖాస్తులు చేయగా, అధికారులు కులగణన సర్వే ప్రామాణికంగా పరిశీలిస్తున్నారు.
News February 23, 2025
టన్నెల్‌లో బయటపడ్డ కార్మికుడి చెయ్యి

TG: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకుపోయిన వారి ఆచూకీని సహాయక బృందాలు కనుగొన్నాయి. టన్నెల్‌లో 14వ కి.మీ వద్ద మట్టి దిబ్బల్లో ఓ కార్మికుడి చేయి బయటపడింది. దీంతో లోపల చిక్కుకుపోయిన 8 మందిలో ఎంత మంది ప్రాణాలతో ఉన్నారనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారంతా బురదలో కూరుకుపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సహాయక బృందాలు రెస్క్యూను ముమ్మరం చేశాయి.
News February 23, 2025
రేపు ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు

TG: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 24న ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా ప్రకటించారు. బదులుగా ఏప్రిల్ 12న రెండో శనివారం వర్కింగ్ డేగా పరిగణించాలన్నారు. ఉత్సవాల్లో భాగంగా రేపు ఆదిలాబాద్ రాం లీలా మైదానంలో వేడుకల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.