News October 6, 2025

DRDOలో 50 పోస్టులు

image

DRDO ఆధ్వర్యంలోని ప్రూప్& ఎక్స్‌పెరిమెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ 50 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. BE/బీటెక్, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈనెల 19వరకు అప్లై చేసుకోవచ్చు. ముందుగా NATSలో ఎన్‌రోల్ చేసుకోవాలి. మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ/ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.12,300, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.10,900 చెల్లిస్తారు.

Similar News

News October 6, 2025

UPI పిన్ మర్చిపోయారా? ఇలా చేయండి 2/2

image

చాలా మంది UPI పిన్‌ను మర్చిపోయి పేమెంట్స్ చేసే సమయంలో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సమయంలో మీ UPI యాప్‌లో “Forgot UPI PIN” అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. మీ డెబిట్ కార్డు వివరాలను (చివరి 6 అంకెలు, గడువు తేదీ) ఉపయోగించి కొత్త పిన్‌ను సెట్ చేసుకోవచ్చు. వీలైనంత వరకు UPI పిన్‌ను లేదా OTPని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. UPI యాప్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి.

News October 6, 2025

UPI లావాదేవీల్లో సమస్యలొస్తే ఇలా చేయండి1/2

image

క్యాష్‌లెస్ పేమెంట్స్ వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ఈక్రమంలో UPI, ఆన్‌లైన్ పేమెంట్స్‌లో సమస్యలెదురైతే ఇలా చేయండి. డబ్బు పంపే సమయంలో మన అకౌంట్‌లో డెబిట్ అయినా అవతలి వారికి చేరదు. ఇంటర్-బ్యాంక్ సర్వర్ల మధ్య కమ్యూనికేషన్ లోపం వల్ల ఇలా జరగొచ్చు. 3 రోజుల్లో డబ్బు తిరిగి రాకపోతే మీరు వాడిన <<17922440>>UPI<<>> యాప్ కస్టమర్ కేర్‌‌‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. లేదా NPCI పోర్టల్‌లో కంప్లైంట్ ఇవ్వాలి. SHARE IT

News October 6, 2025

బీసీ రిజర్వేషన్ల జీవోపై సుప్రీం స్టే విధిస్తే?

image

TG: స్థానిక ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో-9పై సుప్రీంలో కాసేపట్లో విచారణ జరగనుంది. ప్రభుత్వం తరఫున లాయర్లు సింఘ్వీ, దవే వాదనలు వినిపించనున్నారు. అటు ఈ జీవో పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌ 285కు విరుద్ధమని పిటిషనర్‌ గోపాల్‌రెడ్డి వాదిస్తున్నారు. దీంతో జీవోపై SC స్టే విధిస్తే ఎన్నికలకు బ్రేక్ పడుతుందా? లేక సర్కార్ ముందుకే వెళ్తుందా? అనేది ఉత్కంఠగా మారింది.