News October 19, 2025

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 50 పోస్టులు

image

పుణేలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దేహు రోడ్ 50 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్‌తో పాటు నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు నవంబర్ 7లోపు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. వయసు 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://munitionsindia.in/career/

Similar News

News October 19, 2025

శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం 27 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నట్లు చెప్పారు. కాగా శ్రీవారిని నిన్న 82,136 మంది దర్శించుకున్నారు. వారిలో 29,023 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ కానుకల ద్వారా స్వామివారికి రూ.3.49 కోట్ల ఆదాయం వచ్చింది.

News October 19, 2025

టాస్ ఓడిన భారత్

image

తొలి వన్డే: భారత్‌తో పెర్త్‌లో జరగనున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ వన్డేల్లో అరంగేట్రం చేస్తున్నారు.
జట్లు:
IND: రోహిత్, గిల్(C), కోహ్లీ, శ్రేయస్, రాహుల్, అక్షర్ పటేల్, సుందర్, నితీశ్ కుమార్, హర్షిత్ రాణా, సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్
AUS: హెడ్, మార్ష్(C), షార్ట్, ఫిలిప్, రెన్‌షా, కొన్నోలీ, ఓవెన్, స్టార్క్, ఎల్లిస్, కున్హెమన్‌, హేజిల్‌వుడ్

News October 19, 2025

దీపావళి దీపాలు: ఈ తప్పులు చేయకండి

image

దీపావళి పర్వదినాన దీపాలు పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. తడి ప్రమిదల్లో దీపాలు వెలిగించరాదని అంటున్నారు. ‘బొట్టు లేకుండా దీపారాధన చేయకూడదు. దీపం వెలిగించే సమయంలో మౌనం పాటించాలి. జ్యోతిని ఏక హారతితో వెలిగించడం ఉత్తమం. ఒకే వత్తిని ఉపయోగించకూడదు. రెండు లేదా మూడు వత్తులతో దీపాలు పెట్టడం శుభకరం. ఈ నియమాలు పాటించి, పవిత్ర దీపకాంతిని స్వాగతించాలి’ అని సూచిస్తున్నారు.