News August 26, 2025
50% సుంకాలు.. భారత్‌కు ఎంత నష్టమంటే?

అమెరికా విధించిన 50% <<17519222>>సుంకాలు<<>> ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం భారత్ నుంచి USకు $60.2 బిలియన్ల విలువైన సరుకులు ఎగుమతి అవుతుండగా అవి $18.6 బిలియన్లకు తగ్గుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతారని, GDP 0.2-0.5% తగ్గే అవకాశం ఉందన్నారు. టెక్స్‌టైల్, సముద్ర ఆహారం, లెదర్, ఫుట్‌వేర్, కెమికల్స్, ఆటోమొబైల్స్ రంగాలపై ఎక్కువ ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.
Similar News
News August 26, 2025
ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు

TG: ఈ నెల 30 నుంచి శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వర్షాకాల సమావేశాల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 30న ఉదయం 10.30 గం.కు అసెంబ్లీ సమావేశాలు షురూ కానున్నాయి. ఇందులో ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చించే అవకాశం ఉంది.
News August 26, 2025
RTC ఉద్యోగులకు ప్రమోషన్లు.. సీఎం గ్రీన్ సిగ్నల్

APSRTC ఉద్యోగుల పదోన్నతులకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. దీంతో డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ ఉద్యోగులతో పాటు సూపర్‌వైజర్ కేడర్ వరకు అర్హులైన ఉద్యోగులకు ప్రమోషన్లు రానున్నాయి. సుమారు 3 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. ఈ నెలాఖరుకు GO విడుదలై, సెప్టెంబరు 1 నుంచి ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.
News August 26, 2025
తెలుగు ప్రజలకు సీఎం వినాయక చవితి శుభాకాంక్షలు

AP: గణేశుడిని పూజిస్తున్న ప్రజలకు సకల శుభాలు కలగజేయాలని ఆ వినాయకుడిని ప్రార్థిస్తున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు. రేపు వినాయక చవితి సందర్భంగా తెలుగు ప్రజలకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. ‘మీ కుటుంబ ప్రగతికి, మీ లక్ష్యాలకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఆ గణపతి మిమ్మల్ని అనుగ్రహించాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. అటు రాష్ట్ర ప్రజలకు సకల శుభాలూ కలగాలని మాజీ సీఎం జగన్ ఆకాంక్షించారు.