News April 3, 2024
బైజూస్లో 500 ఉద్యోగాల కోత?
ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న ప్రముఖ ఎడ్టెక్ సంస్థ బైజూస్ తాజాగా మరో 500 మంది ఉద్యోగుల్ని తొలగించినట్లు తెలుస్తోంది. ఎటువంటి నోటీసులు లేకుండా, సంస్థ నుంచి వైదొలగాలని సదరు ఉద్యోగులకు ఫోన్ల ద్వారా సమాచారం పంపుతున్నట్లు సమాచారం. విక్రయ విభాగం, అధ్యాపకులు, ట్యూషన్ సెంటర్లపై ఉద్యోగాల కోత ఉండొచ్చని తెలుస్తోంది. దీనిపై కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Similar News
News November 8, 2024
మహిళల బట్టలు పురుషులు కుట్టకూడదు: మహిళా కమిషన్
మహిళల దుస్తులు పురుషులు కుట్టకూడదని, ఇది బ్యాడ్ టచ్ కిందకే వస్తుందని UP మహిళా కమిషన్ తెలిపింది. స్త్రీల దుస్తుల కొలతలు స్త్రీలు మాత్రమే తీసుకోవాలని, టైలరింగ్ షాపులో CC కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మహిళల శిరోజాలనూ పురుషులు కత్తిరించకుండా, స్త్రీలే కత్తిరించేలా చర్యలు తీసుకోవాలని UP ప్రభుత్వానికి ప్రతిపాదించింది. బ్యాడ్ టచ్ నుంచి మహిళలను రక్షించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.
News November 8, 2024
AUSvsPAK: రెండో వన్డేలో పాక్ ఘన విజయం
ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో పాకిస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కంగారూలు 35 ఓవర్లలో 163 పరుగులకే ఆలౌటయ్యారు. హారిస్ రౌఫ్ 5, షాహీన్ అఫ్రిదీ 3 వికెట్లు తీశారు. 164 రన్స్ లక్ష్యాన్ని పాక్ 26.3 ఓవర్లలో ఛేదించింది. సయీమ్ ఆయుబ్ 82, అబ్దుల్లా 64*, బాబర్ 15* రన్స్ చేశారు. 3 వన్డేల సిరీస్లో ఇరు జట్లు 1-1తో ఉన్నాయి.
News November 8, 2024
ప్రభాస్తో సినిమాలపై హొంబలే ప్రకటన
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో మూడు సినిమాలు తీయనున్నట్లు హొంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. ఇప్పటికే తీసిన ‘సలార్’ సినిమా భారీ విజయం పొందగా ‘సలార్-2’తో పాటు మరో రెండిటికి ప్రభాస్ సైన్ చేసినట్లు తెలిపింది. ఇవి 2026,2027, 2028లో విడుదల అవుతాయని ప్రకటన విడుదల చేసింది. కాగా, ప్రశాంత్ వర్మ, లోకేశ్ కనగరాజ్తో తీసే సినిమాలను హొంబలే నిర్మిస్తున్నట్లు సమాచారం.