News August 10, 2025

OICLలో 500 ఉద్యోగాలు.. వారమే గడువు

image

ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (OICL) 500 అసిస్టెంట్ (క్లాస్III) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ పాసై ఉండాలి. వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం నెలకు రూ.45,000 వరకు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులు రూ.850, మిగతావారు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఈ నెల 17లోపు <>orientalinsurance.org.in<<>> సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Similar News

News August 10, 2025

తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కడతాం: ఉత్తమ్

image

TG: తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టును కట్టి తీరుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. దేవాదుల పంపుహౌస్ పరిశీలించిన ఆయన అక్కడి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతో ముఖ్యమైందని తెలిపారు. భూసేకరణ కోసం రూ.67 కోట్లు అవసరమవుతాయని చెప్పారు. పెండింగ్ బిల్లులనూ త్వరలో మంజూరు చేస్తామన్నారు.

News August 10, 2025

రేపు పీఎం ఫసల్ బీమా యోజన నిధులు విడుదల

image

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద 30లక్షల మంది రైతులకు రేపు పంట బీమా నిధులు రిలీజ్ చేయనున్నారు. రాజస్థాన్‌లో జుంజునులో జరిగే కార్యక్రమంలో రూ.3,200 కోట్ల నగదును కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. అత్యధికంగా మధ్య‌ప్రదేశ్ రైతులకు రూ.1,156కోట్లు, రాజస్థాన్‌కు రూ.1,121కోట్లు, ఛత్తీస్‌గఢ్‌కు రూ.150కోట్లు, ఇతర రాష్ట్రాల రైతులకు రూ.773కోట్లు ట్రాన్స్‌ఫర్ చేయనున్నారు.

News August 10, 2025

రేపు పిడుగులతో కూడిన వర్షాలు: APSDMA

image

AP: దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. బుధవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని అంచనా వేసింది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.