News February 24, 2025
వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 500 సేవలు: చంద్రబాబు

AP: భవిష్యత్లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 500 సేవలు అందించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ‘ప్రభుత్వ కార్యాలయాలు, రైతు బజార్లలో క్యూఆర్ కోడ్ ఉంచాలి. అన్ని కలెక్టరేట్లలో వాట్సాప్ గవర్నెన్స్ సెల్ ఏర్పాటు చేయాలి. నిత్యావసర సరుకుల ధరలు ఎప్పటికప్పుడు సమీక్షించాలి. బెల్టు షాపులు ఎక్కడ ఉన్నా ఉపేక్షించొద్దు’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News November 27, 2025
మెదక్: సర్పంచ్ అభ్యర్థులకు గుర్తులు ఇవే..

సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గుర్తులు 30 ఉండనున్నాయి. అందులో ఉంగరం, కత్తెర, బ్యాట్, ఫుట్ బాల్, లేడీ పర్సు, టీవీ రిమోట్, టూత్ పేస్ట్, స్పానర్, చెత్త డబ్బా, నల్ల బోర్డు, బెండకాయ, కొబ్బరి తోట, వజ్రం, బకెట్, డోర్ హ్యాండిల్, టీ జల్లెడ, చేతి కర్ర, మంచం, పలక, టేబులు, బ్యాటరీ లైట్, బ్రష్, బ్యాట్స్ మాన్, మనిషి, తెరచాపతో పడవ, బిస్కట్, వేణువు, చెయిన్, చెప్పులు, గాలి బుడగ ఉంటాయి.
News November 27, 2025
వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి రక్షణ ఇలా..

వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి ముప్పు ఎక్కువగా ఉంటుంది. దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేరుశనగ పొలం చుట్టూ 4 వరుసల్లో కుసుమ పంట వేస్తే ఆ మొక్క ముళ్లు పందిని గాయపర్చే అవకాశం ఉంది. కుసుమ మొక్క వాసన ఘాటుగా ఉండడం వల్ల వేరుశనగ పంట వైపు పందులు రావు. మొక్కజొన్న పంట చుట్టూ ఆముదం పంటను వేసి రక్షించుకోవచ్చు. అలాగే ముళ్లు గల ఎడారి మొక్కలు, వాక్కాయ మొక్కలను పెంచి పంటలను కాపాడుకోవచ్చు.
News November 27, 2025
RVNLలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (<


