News September 10, 2024
సైబర్ నేరాల అడ్డుకట్టకు 5వేల సైబర్ కమాండోలు

జాతీయ భద్రతలో సైబర్ సెక్యూరిటీ అంతర్భాగమని HM అమిత్ షా అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశం ఎదుగుదలకు అదెంతో కీలకమన్నారు. ‘మానవాళికి టెక్నాలజీ వరం. ఎకానమీకి ఎంతో ఉపయోగకరం. అదే సమయంలో టెక్నాలజీ వల్ల చాలా ముప్పులు కనిపిస్తున్నాయి. సైబర్ సెక్యూరిటీలో ఇండియన్ సైబర్క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కీలకం’ అని అన్నారు. సైబర్ నేరాల అడ్డుకట్టకు రాబోయే ఐదేళ్లలో 5000 సైబర్ కమాండోలకు శిక్షణనిస్తామని తెలిపారు.
Similar News
News November 24, 2025
TAKE A BOW.. 93 రన్స్, 6 వికెట్లు

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా బౌలర్ మార్కో జాన్సెన్ అదరగొట్టారు. తొలి ఇన్నింగ్సులో 8వ స్థానంలో వచ్చిన అతడు 91 బంతుల్లోనే 93 రన్స్ చేశారు. ఏకంగా 7 సిక్సర్లు బాదారు. దీంతో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేయగలిగింది. అటు బౌలింగ్లో 6 కీలక వికెట్లు తీసి భారత బ్యాటింగ్ ఆర్డర్ను కుప్పకూల్చారు. చక్కటి బౌన్సర్లతో మనోళ్లను ముప్పుతిప్పలు పెట్టారు.
News November 24, 2025
భక్తులకు ద్రోహం చేశారు: పవన్ కళ్యాణ్

AP: 2019-24 మధ్య తిరుమలకు వెళ్లిన భక్తులను మోసం చేశారని Dy.CM పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఐదేళ్లలో 20కోట్లకు పైగా కల్తీ లడ్డూలు తయారు చేశారని సిట్ తేల్చిందన్న కథనాలపై ఆయన స్పందించారు. ‘గత TTD బోర్డులోని అధికారులు భక్తులకు ద్రోహం చేశారు. మనం భక్తితో నమస్కరిస్తుంటే, వాళ్లు మన హృదయాలను ముక్కలు చేశారు. నిబంధనలను ఉల్లంఘించడమే కాదు, మనం పెట్టుకున్న నమ్మకాన్ని కూడా తుంచేశారు’ అని ట్వీట్ చేశారు.
News November 24, 2025
బీజేపీతో పొత్తు.. కొట్టిపారేసిన ఒవైసీ

‘బీజేపీతో మజ్లిస్ పొత్తు’ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. తాను చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా వర్గాలు వక్రీకరించి తప్పుదోవ పట్టించాయన్నారు. ‘ఏ కూటమిలో చేరే ఆలోచన లేదు. బీజేపీ భాగస్వామ్యం ఉన్న ఏ సర్కారుకూ మద్దతివ్వం. అయితే సీమాంచల్(బిహార్)అభివృద్ధికి నితీశ్ ప్రభుత్వం కృషి చేస్తే సహకరిస్తాం’ అని స్పష్టం చేశారు. తమ పోరాటం ప్రజల హక్కుల కోసమేనని తేల్చి చెప్పారు.


