News March 24, 2025
ర్యాగింగ్ భూతానికి నాలుగేళ్లలో 51మంది బలి

ర్యాగింగ్ భూతం కారణంగా దేశవ్యాప్తంగా గత నాలుగేళ్లలో 51మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ‘స్టేట్ ఆఫ్ ర్యాగింగ్ ఇన్ ఇండియా’ నివేదిక వెల్లడించింది. ‘2020-24 మధ్యకాలంలో 1946 కాలేజీల నుంచి హెల్ప్లైన్కు 3156 ఫిర్యాదులు అందాయి. అధిక ఫిర్యాదులు వైద్య కళాశాలల నుంచే ఉన్నాయి. మొత్తం కేసుల్లో 45.1శాతం మేర మెడికల్ కాలేజీలవే. మానసిక ఒత్తిడి భరించలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు’ అని పేర్కొంది.
Similar News
News November 28, 2025
శరవేగంగా అమరావతి పనులు: మంత్రి లోకేశ్

AP: రైతుల త్యాగ ఫలితమే అమరావతి అని మంత్రి లోకేశ్ చెప్పారు. గత ప్రభుత్వం దీన్ని విధ్వంసం చేయడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. 3 రాజధానులు అని చెప్పి ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు. బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అనే నినాదంతో 1,631 రోజులపాటు రైతులు ఉద్యమం చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి’ అని తెలిపారు.
News November 28, 2025
WPL వేలంలో అదరగొట్టిన తెలుగమ్మాయిలు

WPL 2026 వేలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్లేయర్స్ సత్తా చాటారు. గొంగడి త్రిషను రూ.10 లక్షలకు యూపీ వారియర్స్, మమతను రూ.10 లక్షలకు ఢిల్లీక్యాపిటల్స్, క్రాంతిరెడ్డిని రూ.10 లక్షలకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకున్నాయి. అరుంధతి రెడ్డిని రూ.75 లక్షలకు RCB జట్టు ఎంచుకుంది. ఇటీవలి వన్డే వరల్డ్ కప్ విజయంలో ప్రధాన పాత్ర పోషించిన నల్లపు రెడ్డి శ్రీచరణిని రూ.1.30 కోట్లతో ఢిల్లీ తిరిగి సొంతం చేసుకుంది.
News November 28, 2025
స్విగ్గీ, జొమాటో, జెప్టో గోడౌన్లలో ఇదీ పరిస్థితి

TG: హైదరాబాద్లో ఆన్లైన్ డెలివరీ సంస్థల గోడౌన్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. స్విగ్గీ, జెప్టో, జొమాటో, బిగ్ బాస్కెట్ వంటి సంస్థలకు చెందిన 75 గోడౌన్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో ఎక్స్పైర్డ్, మిస్ బ్రాండెడ్ వస్తువులను సీజ్ చేశారు. కుళ్లిన ఫ్రూట్స్, కూరగాయలను గుర్తించారు. పలు వస్తువుల శాంపిల్స్ సేకరించారు. ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేశారు.


