News December 21, 2025
514 పోస్టులు.. అప్లికేషన్ల స్వీకరణ మొదలు

బ్యాంక్ ఆఫ్ ఇండియా 514 క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్ల స్వీకరణ మొదలైంది. ఆన్‌లైన్‌లో 2026 జనవరి 5వ తేదీ వరకూ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీస విద్యార్హత డిగ్రీ, పోస్టులను బట్టి వయస్సు: 25-40 పరిమితి ఉంది. ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ప్రతిభ ఆధారంగా (70:30) ద్వారా ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలకు BOI అధికారిక సైట్ చూడండి.
Similar News
News December 22, 2025
బంగ్లాదేశ్‌లో హిందువుల జనాభా ఎంతంటే?

బంగ్లాదేశ్‌లో హిందువులపై ఈ మధ్య దాడులు పెరిగాయి. ఇటీవల దీపూ చంద్రదాస్ హత్యతో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. భారత ప్రభుత్వం సైతం దీన్ని నిశితంగా పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ హిందువుల జనాభా ఎంతనే చర్చ జరుగుతోంది. బంగ్లా 2022 సెన్సస్ ప్రకారం ఆ దేశంలో దాదాపు 1.3 కోట్ల మంది హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు. ఇది ఆ దేశ మొత్తం జనాభాలో 8%. భారత్, నేపాల్ తర్వాత అత్యధిక మంది హిందువులున్నది బంగ్లాలోనే.
News December 22, 2025
IT అధికారులు మీ వాట్సాప్, మెయిల్ చెక్ చేస్తారా?

ఏప్రిల్ 2026 నుంచి ట్యాక్స్ పేయర్స్ వాట్సాప్, ఈమెయిల్స్‌ను అధికారులు చూస్తారంటూ SMలో ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. అయితే Income Tax Act 2025లోని సెక్షన్ 247 కేవలం ట్యాక్స్ ఎగవేసే వారి కోసమే తెచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు. నోటీసులకు స్పందించని, ఆదాయం దాచే వారి డిజిటల్ డేటాను కోర్టు పర్మిషన్, సరైన రీజన్‌తో మాత్రమే చెక్ చేసేలా పాత చట్టాన్ని డిజిటల్ కాలానికి తగ్గట్టుగా మార్చారని తెలిపారు.
News December 22, 2025
విద్యుత్ ఉద్యోగులకు 17.6% డీఏ

TG: విద్యుత్ ఉద్యోగులకు 17.6% DA ఖరారైంది. ఉన్నతాధికారుల ప్రతిపాదనలకు Dy.CM భట్టి విక్రమార్క ఆమోదం తెలిపారు. ఇది ఈ ఏడాది జులై 1 నుంచే వర్తించనుంది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో విద్యుత్ సంస్థల పరిధిలోని 71,387 మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.


