News July 27, 2024
52 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 52 అడుగులకు చేరింది. మూడో ప్రమాద హెచ్చరికకు వరద నీరు దగ్గరగా రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే భద్రాచలంలోని పలు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. భద్రాచలంలోని నన్నపనేని హైస్కూల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు.
Similar News
News October 25, 2025
పఠన సామర్థ్యం కోసం ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల పఠన సామర్థ్యం పెంచే లక్ష్యంతో అక్టోబర్ 27 నుంచి ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు దీనిని అమలు చేయాలని ఆదేశించారు. ఆంగ్ల భాష ఫొనెటిక్స్ ఆధారంగా రూపొందించిన ఈ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులు సులభంగా చదవడం నేర్పాలన్నారు.
News October 25, 2025
సత్తుపల్లిలో 5 వేల ఉద్యోగాలకు రేపు జాబ్ మేళా

రేపు సత్తుపల్లిలోని రాణీ సెలబ్రేషన్స్‌లో నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ కోరారు. 80కి పైగా కంపెనీల్లో సుమారు 5 వేల ఉద్యోగాల కోసం ఉదయం 8 గంటలకు అభ్యర్థులు సరైన ధ్రువపత్రాలతో రావాలన్నారు. సింగరేణి సంస్థ, టాస్క్ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టే ఈ జాబ్ మేళా ఎమ్మెల్యే డా.రాగమయి సారథ్యంలో చేపడుతున్నామన్నారు.
News October 25, 2025
పది విద్యార్థులు 30లోగా ఫీజు చెల్లించండి: ఇన్ఛార్జ్ డీఈవో

2026 మార్చిలో నిర్వహించే పరీక్షలకు హాజరు కానున్న పదోతరగతి, ఒకేషనల్ విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని ఇన్ఛార్జ్ డీఈవో, అదనపు కలెక్టర్ పి.శ్రీజ తెలిపారు. రూ.50 పైన్‌తో నవంబరు 15, రూ.200ల ఆలస్య రుసుంతో డిసెంబరు 2, రూ.500 పైన్‌తో డిసెంబరు 15 లోగా ఫీజు చెల్లించవచ్చని తెలిపారు.


