News October 27, 2025
52 ఉద్యోగాలు.. ఇంటర్వ్యూతో ఎంపిక

ఎయిమ్స్ గోరఖ్‌పూర్ 52 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. మెడికల్ పీజీ ఉత్తీర్ణతతో పాటు NMC/MCI/SMCలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఈ నెల 29న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. ఇంటర్వ్యూ/రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, STలకు రూ.250, PWBDలకు ఫీజునుంచి మినహాయింపు ఉంది. వయసు 45ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://aiimsgorakhpur.edu.in/
Similar News
News October 27, 2025
పంచభూతాల నుంచి నేర్చుకుందాం!

జీవితంలో విజయం సాధించడానికి పంచభూతాల నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. భూమిలా సహనంతో ధైర్యంగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. నీరు మురికిని కడిగినట్టు మంచి మనసుతో నెగటివిటీని దూరం చేయాలి. ఎక్కడా అటాచ్ అవ్వకుండా గాలిలా స్వేచ్ఛగా జీవించాలి. నిప్పులా మీ ఆత్మవిశ్వాసం, శక్తి ప్రకాశవంతంగా వెలగాలి. ఆకాశం దేనికీ కనెక్ట్ అవ్వనట్టు, మనపై పని ఒత్తిడి పడకుండా రిలాక్స్డ్‌గా ఉండాలి. SHARE IT
News October 27, 2025
కుక్కల వ్యవహారం.. సీఎస్‌లకు సుప్రీం సమన్లు

దేశవ్యాప్తంగా వీధి కుక్కల కేసులో తెలంగాణ, బెంగాల్ మినహా అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 22న ఇచ్చిన ఆదేశాల మేరకు అఫిడవిట్లు ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించింది. దీనిపై సీఎస్‌లు హాజరై వివరణ ఇవ్వాలని, లేదంటే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. తదుపరి విచారణను Nov 3కు వాయిదా వేసింది. కాగా కుక్కల వ్యవహారంలో TG, WB మాత్రమే అఫిడవిట్లు దాఖలు చేశాయి.
News October 27, 2025
మిరప ముంపునకు గురైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వర్షాల వల్ల పూత, కాత దశలో ఉన్న పచ్చిమిచ్చిలో శనగపచ్చ పురుగు, కాల్షియం లోపం, వేరుకుళ్లు సమస్యలు వస్తాయి. మిరపలో శనగపచ్చ పురుగు నివారణకు లీటరు నీటికి ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4గ్రా లేదా క్లోరాంట్రినిలిప్రోల్ 0.3mlను కలిపి పిచికారీ చేయాలి. కాల్షియం, ఇతర సూక్ష్మధాతు లోప నివారణకు లీటరు నీటికి ఆగ్రోమిన్ మాక్స్ (ఫార్ములా-6) 5 గ్రాములు, కాల్షియం నైట్రేట్ 5 గ్రాములను కలిపి 2-3 సార్లు పిచికారీ చేయాలి.


