News December 25, 2024
రోడ్డు పక్కన 52 కేజీల బంగారం, రూ.11 కోట్ల డబ్బు.. ఇతనివే!

మధ్యప్రదేశ్ భోపాల్‌లో ఇటీవల రోడ్డు పక్కన కారులో 52 కేజీల <<14936521>>బంగారం<<>>, రూ.11 కోట్ల నగదు లభ్యమైన విషయం తెలిసిందే. ఇది బిల్డర్‌గా మారిన ఆర్టీవో మాజీ కానిస్టేబుల్ సౌరభ్ శర్మ అనుచరుడు చేతన గౌర్‌కు చెందిన కారుగా గుర్తించారు. తాజాగా, లోకాయుక్త పోలీసుల తనిఖీల్లో మాజీ కానిస్టేబుల్ సౌరభ్ ఇంట్లో రూ.2.87 కోట్ల నగదు, 234 కేజీల వెండిని సీజ్ చేశారు. వీరిద్దరిపై ఈడీ కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తోంది.
Similar News
News January 11, 2026
ఇతిహాసాలు క్విజ్ – 124 సమాధానం

ప్రశ్న: కురుక్షేత్రంలో బలరాముడు ఎందుకు పాల్గొనలేదు?
సమాధానం: నాగలి ఆయుధం గల బలరాముడికి కౌరవ, పాండవులిద్దరూ సమానులే. అందుకే ఆయనకు యుద్ధం ఇష్టముండదు. ఓవైపు కృష్ణుడు ప్రాతినిధ్యం వహించే పాండవ సేన, మరోవైపు ప్రియ శిష్యుడు దుర్యోధనుడి కౌరవ సేన.. ఇద్దరూ బంధువులే కావడంతో ఎవరి పక్షం వహించలేదు. యుద్ధానికి ముందు ఆయుధాలు వదిలి ప్రశాంతత కోసం సరస్వతీ నది తీరం వెంబడి తీర్థయాత్రలకు వెళ్లాడు. <<-se>>#Ithihasaluquiz<<>>
News January 11, 2026
పండుగల్లో డైట్ జాగ్రత్త

పండుగ రోజుల్లో సాధారణంగా చాలా త్వరగా లేచి హడావిడిగా పనులు చేస్తుంటారు. టిఫిన్ చేసే టైం లేక కనిపించిన పిండి వంటలనే నోట్లో వేసుకుంటారు. ఇలా కాకుండా ఉండాలంటే పాలల్లో కాస్త బెల్లం వేసుకొని తాగడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. ఈ సమయంలో కాఫీలు, కూల్ డ్రింకులు కాకుండా కొన్ని పండ్లు, పండ్ల రసాలు అందుబాటులో పెట్టుకోండి. దీంతో జంక్ ఫుడ్ జోలికి పోకుండా ఉంటారు. ముఖ్యంగా రాత్రిళ్లు త్వరగా భోజనం చెయ్యాలి.
News January 11, 2026
YouTubeపై వియత్నాం కొత్త రూల్.. 5 సెకన్ల తర్వాత స్కిప్ ఉండాల్సిందే!

YouTube వీడియోలు చూడాలంటే యాడ్స్ చిరాకు తెప్పిస్తాయి. అయితే వియత్నాం ప్రభుత్వం యాడ్స్‌పై పరిమితులు విధిస్తూ చట్టం తీసుకువచ్చింది. ప్రతి వీడియోలో యాడ్ స్టార్ట్ అయిన 5 సెకన్లకు స్కిప్ ఆప్షన్ కచ్చితంగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో బలవంతంగా యాడ్స్ చూడాల్సిన బాధ తప్పుతుంది. ఇన్‌స్టా, టిక్‌టాక్‌కూ ఈ రూల్ వర్తించనుంది. FEB 15 నుంచి కొత్త విధానం అమలు కానుంది. మన దగ్గరా ఇలా చేయాల్సిందేనా? COMMENT?


