News October 8, 2025
53 అంగన్‌వాడీ హెల్పర్ ఉద్యోగాలు

AP: విశాఖపట్నం జిల్లాలో 53 అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులకు జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ &సాధికారత కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది. స్థానికంగా స్థిరంగా నివసిస్తూ, 7వ తరగతి పాసైనవారు ఈ నెల 14వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 21 నుంచి 35 ఏళ్ల లోపు ఉండాలి. భీమునిపట్నం డివిజన్‌లో 11, విశాఖపట్నం డివిజన్‌లో 42 పోస్టులు ఉన్నాయి. సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
Similar News
News October 8, 2025
రైట్స్‌లో 9 ఇంజినీరింగ్ పోస్టులు

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(రైట్స్) 9 ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా, బీఈ, బీటెక్/ఎంఈ, ఎంటెక్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం గల అభ్యర్థులు ఈనెల 16వరకు అప్లై చేసుకోవచ్చు. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి నేటి నుంచి ఈనెల 17వరకు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వీటిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. వెబ్‌సైట్: https://rites.com/
News October 8, 2025
BC రిజర్వేషన్లపై విచారణకు లంచ్ బ్రేక్

TG: BC రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణకు లంచ్ బ్రేక్ ప్రకటించిన జడ్జి 2:30pm నుంచి వాదనలు వింటామన్నారు. అంతకుముందు వాదనల్లో.. ప్రభుత్వం పంపిన బిల్లును గవర్నర్ ఆమోదించలేదు కాబట్టి పాత చట్టం అమల్లో ఉన్నట్లే అని, దీంతో జీవో చెల్లదని పిటిషనర్ వాదించారు. అటు బిల్లు గవర్నర్ వద్దకు వెళ్లాక గడువులోపు సంతకం పెట్టకుంటే కేబినెట్‌కు వస్తుందని, మళ్లీ పంపినా తర్వాత సానుకూల నిర్ణయం రాకుంటే జీవో ఇవ్వాలన్నారు.
News October 8, 2025
కమిన్స్, హెడ్‌కు రూ.58 కోట్ల ఆఫర్!

ఆసీస్ క్రికెటర్లు కమిన్స్, హెడ్‌కు ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీ భారీ మొత్తం ఆఫర్ చేసినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. AUSను వీడి తమ ఫ్రాంచైజీ తరఫున గ్లోబల్ T20 టోర్నీల్లో ఆడితే ఏడాదికి రూ.58.2 కోట్ల చొప్పున ఇవ్వజూపినట్లు వెల్లడించాయి. దీనికి ప్లేయర్లు అంగీకరించలేదని తెలిపాయి. కాగా AUS జట్టు ఏడాదికి ఈ ప్లేయర్లకు చెరో రూ.8.74 కోట్లు చెల్లిస్తోంది. దీనికి దాదాపు 7 రెట్లు IPL ఫ్రాంచైజీ ఆఫర్ చేయడం గమనార్హం.