News October 25, 2025
ఐఐటీ బాంబేలో 53 పోస్టులు.. అప్లై చేశారా?

ఐఐటీ బాంబే 53 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 7వరకు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్, Jr మెకానిక్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి వివిధ అర్హతలున్నాయి. వెబ్‌సైట్: https://www.iitb.ac.in/career/apply
Similar News
News October 25, 2025
ఒత్తయిన జుట్టు కోసం ఇలా చేయండి

ఒత్తయిన జుట్టు కోసం మహిళలు ఎన్నో ప్రొడక్టులు వాడుతుంటారు. అలాకాకుండా ఇంట్లో లభించే పదార్థాలతోనే జుట్టు ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. ఒక కీరాని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులో పెసరపిండి, శనగపిండి, మెంతి పొడి(ఒక్కో స్పూన్ చొప్పున) కలిపి మిక్సీలో వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వెంట్రుకల కుదుళ్ల వరకు పట్టించి 30ని. తర్వాత తల స్నానం చేయాలి. వారంలో ఓసారి ఈ ప్యాక్ ట్రై చేస్తే ఒత్తయిన జట్టు సాధ్యమవుతుంది.
News October 25, 2025
AIIMS రాయ్‌పూర్‌లో జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

<
News October 25, 2025
హైదరాబాద్‌లో స్టార్‌లింక్ ఎర్త్ స్టేషన్?

టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు చెందిన ‘స్టార్‌లింక్’ మన దేశంలో ఇంటర్నెట్ సర్వీసులు ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఇందులోభాగంగా దేశంలోని 9 సిటీల్లో ఎర్త్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. హైదరాబాద్, ముంబై, నోయిడా, చండీగఢ్, కోల్‌కతా, లక్నో తదితర నగరాలు ఈ లిస్టులో ఉన్నాయని సమాచారం. జాతీయ భద్రత దృష్ట్యా టెస్టింగ్ దశలో స్టార్‌లింక్‌కు కఠిన ఆంక్షలతో కేంద్రం తాత్కాలిక అనుమతులు ఇచ్చింది.


