News September 25, 2024

నాణ్యత పరీక్షల్లో 53 రకాల మందులు ఫెయిల్

image

కొన్ని సంస్థల పారాసెటమాల్ IP 500 MG, విటమిన్ C, D3 షెల్కాల్, విటమిన్ B కాంప్లెక్స్, C సాఫ్ట్‌జెల్స్ త‌దిత‌ర 53 ర‌కాల మందులు నాణ్య‌త పరీక్షల్లో విఫ‌ల‌మైన‌ట్టు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ తెలిపింది. కాల్షియం, యాంటీ-డయాబెటిస్ మాత్రలు, అధిక రక్తపోటు మందులు Telmisartan ఈ జాబితాలో ఉన్నాయి. ఈ మందులను హెటిరో డ్రగ్స్, ఆల్కెమ్ లేబొరేటరీస్ తదితర సంస్థలు తయారు చేసినవి. <>జాబితా<<>> ఇదిగో.

Similar News

News September 25, 2024

యాంగ్రీ లుక్‌లో ఎన్టీఆర్.. ‘దేవర’ నయా పోస్టర్

image

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవర’. మరో రెండు రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కానుండగా చిత్ర యూనిట్ కొత్త పోస్టర్‌ను ట్వీట్ చేసింది. ఎన్టీఆర్ చేతిలో ఆయుధంతో యాంగ్రీ లుక్‌లో ఉన్నారు. ‘ఆయుధం రక్తం రుచి చూసింది. తర్వాతి వంతు ప్రపంచానిదే. మరో రెండు రోజుల్లో..’ అని రాసుకొచ్చింది.

News September 25, 2024

విశాఖ ఉక్కుకు పునర్వైభవం: లోకేశ్

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రశ్నే లేదని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. విశాఖ ప్రాంత కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో లోకేశ్ సమావేశమై ప్లాంట్ అంశంపై చర్చించారు. విశాఖ ఉక్కుతో ప్రతి తెలుగు వారికి అనుబంధం ఉందని చెప్పారు. ఉక్కు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామన్నారు. విశాఖ ఉక్కుకు పునర్వైభవం తీసుకొస్తామని వివరించారు.

News September 25, 2024

దసరాలోగా నాలుగో విడత రుణమాఫీ?

image

TG: దసరాలోగా నాలుగో విడత రుణమాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 4.25 లక్షల మందికి మాఫీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే 22 లక్షల మందికి రూ.17,934 కోట్లు మాఫీ చేసింది. రేషన్ కార్డులు లేని రైతులు, ఆధార్, బ్యాంకు ఖాతాల్లో తప్పులు ఉన్నవారికి, ఇతర సాంకేతిక సమస్యలు, కుటుంబ నిర్ధారణ కానివారికి మాఫీ చేస్తారు. ఇందుకు సంబంధించిన డేటా అప్‌లోడ్ ప్రక్రియ ఈ నెలాఖరుతో ముగియనుంది.