News August 22, 2024

5351 బ్యాంక్ ఉద్యోగాలు.. గడువు పెంపు

image

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5,351 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ గడువును IBPS ఈ నెల 28 వరకు పొడిగించింది. వీటిలో 4,455 PO/మేనేజ్‌మెంట్ ట్రైనీస్ పోస్టులు, 896 SO జాబ్స్ ఉన్నాయి. ఉద్యోగాన్ని బట్టి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, బీఈ, బీటెక్, PG, MBA పూర్తయిన వారు అర్హులు. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం<> https://www.ibps.in/<<>> వెబ్‌సైట్‌లో చూడగలరు.

Similar News

News December 8, 2025

TVK సభకు పోలీసుల ఆంక్షలు.. 5వేల మందికే పర్మిషన్

image

TVK పార్టీ చీఫ్ విజయ్ రేపు పుదుచ్చేరిలో నిర్వహించే సభకు పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. TVK ఇష్యూ చేసిన QR కోడ్ పాసులున్న 5వేల మంది స్థానికులనే సభకు అనుమతిస్తామన్నారు. పిల్లలు, గర్భిణులు, వృద్ధులకు ఎంట్రీ లేదని చెప్పారు. సభ వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, అంబులెన్సులు, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు ఏర్పాటు చేసుకోవాలని పార్టీని ఆదేశించారు. కరూర్ లాంటి ఘటన మరోసారి జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

News December 8, 2025

నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ

image

జాతీయ గేయం వందేమాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రత్యేక చర్చ జరగనుంది. లోక్‌సభలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీ చర్చను ప్రారంభించి సుదీర్ఘంగా ప్రసంగిస్తారు. ఈ గేయంపై 10 గంటలపాటు చర్చ సాగనుంది. రాజ్యసభలో అమిత్‌షా చర్చను మొదలుపెడతారు. స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తినిచ్చిన ‘వందేమాతరం’ చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతపై పలువురు ఎంపీలు మాట్లాడతారు.

News December 8, 2025

అప్పట్లో చందర్‌పాల్.. ఇప్పుడు స్మిత్ ఎందుకంటే?

image

యాషెస్ 2వ టెస్టులో ఆసీస్ కెప్టెన్ స్మిత్ బ్యాటింగ్ చేసే సమయంలో కళ్ల కింద నల్లటి స్టిక్కర్లు అంటించుకొని కనిపించారు. వాటిని యాంటీ గ్లేర్ స్ట్రిప్స్ అని అంటారు. కాంతి నేరుగా కళ్ల మీద పడకుండా అవి ఆపుతాయి. ముఖ్యంగా ఫ్లడ్ లైట్ల నుంచి వచ్చే కాంతిని కట్ చేసి బంతి స్పష్టంగా కనిపించేందుకు సాయపడతాయి. గతంలో వెస్టిండీస్ లెజండరీ బ్యాటర్ చందర్‌పాల్ కూడా ఇలాంటివి ధరించేవారు. మీకు తెలిస్తే COMMENT చేయండి.