News August 28, 2024
బ్యాంకుల్లో 5,351 ఉద్యోగాలు.. ఇవాళే లాస్ట్ డేట్

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5,351 ఉద్యోగాల భర్తీకి IBPS దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. వీటిలో 4,455 PO/మేనేజ్మెంట్ ట్రైనీస్, 896 స్పెషలిస్టు ఆఫీసర్ జాబ్స్ ఉన్నాయి. ఇప్పటికే ఓసారి గడువు పొడిగించినందున మరోసారి అవకాశం ఉండకపోవచ్చు. డిగ్రీ, బీఈ, బీటెక్, MBA పూర్తయిన వారు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం <
Similar News
News November 3, 2025
కాసేపట్లో ఘటనాస్థలికి మంత్రి పొన్నం

TG: మీర్జాగూడ బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కాసేపట్లో ఆయన ఘటనాస్థలికి చేరుకోనున్నారు. మీర్జాగూడ ఘటన కలిచివేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మృతుల కుటుంబాలకు బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదానికి కారణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
News November 3, 2025
పశువుల్లో క్షయ వ్యాధి.. ఇలా గుర్తించండి

పశువుల్లో క్షయ వ్యాధి మైకోబాక్టీరియా వల్ల సోకుతుంది. ఈ వ్యాధి సోకిన పశువులు శ్వాస వదిలినప్పుడు, తుమ్మినప్పుడు.. మైకోబాక్టీరియా గాలిలో కలిసిపోతుంది. ఈ బాక్టీరియాతో కలుషితమైన మేత, నీరు, పాలను తాగడం వల్ల క్షయ వ్యాధి ఇతర పశువులకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన పశువులు బరువు తగ్గుతాయి. ముక్కు నుంచి నీరు కారుతుంది. ఈ లక్షణాలు కనిపించిన జీవాలను ఇతర పశువుల నుంచి వేరు చేసి వెటర్నరీ నిపుణులకు చూపించాలి.
News November 3, 2025
WCలో సత్తా చాటిన తెలుగమ్మాయి శ్రీ చరణి

భారత మహిళల జట్టు <<18182320>>వన్డే వరల్డ్<<>> కప్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్లో కడపకు చెందిన శ్రీ చరణి అద్భుత ప్రదర్శనతో టీమ్ ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషించారు. మొత్తం 9 మ్యాచుల్లో 14 వికెట్లు తీసి అత్యధిక వికెట్స్ తీసిన నాలుగో బౌలర్గా నిలిచారు. తొలిస్థానంలో ఉన్న దీప్తీ శర్మ(22) తర్వాత ఇండియా నుంచి శ్రీ చరణి మాత్రమే టాప్ 10లో చోటు దక్కించుకోవడం విశేషం.


