News September 25, 2024

JK రెండో విడత ఎన్నికల్లో 54% పోలింగ్

image

జమ్మూకశ్మీర్ రెండో విడ‌త‌ అసెంబ్లీ ఎన్నికల్లో 7 గంట‌ల వ‌ర‌కు <>54.11% పోలింగ్<<>> జ‌రిగింది. 6 జిల్లాల్లో 26 స్థానాల‌కు ఎన్నిక‌లు నిర్వహించారు. వ్యాలీలోని 15, జ‌మ్మూలోని 11 స్థానాల్లో పోలింగ్ జ‌రిగింది. శ్రీనగర్‌లో అత్య‌ల్పంగా 27.37% ఓటింగ్ న‌మోదైంది. EX CM ఓమర్ అబ్దుల్లా పోటీ చేసిన బుద్గాం, గందెర్బాల్‌లో 58% చొప్పునా పోలింగ్ జరిగింది. 1st ఫేజ్‌లో 61% ఓటింగ్ జ‌రిగిన విషయం తెలిసిందే. చివ‌రి విడ‌త ఎన్నిక‌లు అక్టోబ‌ర్ 1న జ‌ర‌గ‌నున్నాయి.

Similar News

News October 17, 2025

నారాయణమూర్తి దంపతులపై సిద్దరామయ్య ఫైర్

image

సామాజిక సర్వేపై ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి దంపతుల <<18022008>>కామెంట్స్‌పై<<>> కర్ణాటక CM సిద్దరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది వెనుకబడిన కులాల సర్వే కాదని 20 సార్లు చెప్పాం. వారికి అర్థం కాకపోతే నేనేం చేయాలి. ఇన్ఫోసిస్ ఉందని వారికి అన్నీ తెలుసనుకుంటున్నారా? ఇది పూర్తిగా పాపులేషన్ సర్వే. మరి కేంద్రం చేపడుతున్న సర్వేపై ఏమంటారు?’ అని ప్రశ్నించారు. అటు సర్వేపై ఎవరినీ బలవంతం చేయమని Dy.CM శివకుమార్ అన్నారు.

News October 17, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

* జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నామినేషన్ వేసిన INC అభ్యర్థి నవీన్ యాదవ్
* గ్రామీణ ప్రాంతాల్లో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల.. 17 ప్యాకేజీల్లో 7,449km రోడ్లకు రూ.6,294 కోట్లు వెచ్చించనున్న ప్రభుత్వం
* మద్యం దుకాణాల టెండర్లకు రేపటితో ముగియనున్న గడువు.. 2,620వైన్స్‌లకు 25వేల దరఖాస్తులు
* బీసీ రిజర్వేషన్ల అంశంలో BJPని కాంగ్రెస్ బద్నాం చేస్తోందన్న MP డీకే అరుణ

News October 17, 2025

ఫేక్ ORSలపై యుద్ధంలో గెలిచిన హైదరాబాద్ డాక్టర్

image

ప్రస్తుతం మార్కెట్లో ORS పేరిట హానికారక ద్రావణాలను టెట్రా ప్యాకెట్లలో అమ్ముతున్నారు. వీటిని వాడటం పిల్లలకు, మధుమేహులకు, వృద్ధులకు ప్రమాదమని సీనియర్ పీడియాట్రిషియన్‌ శివరంజని సంతోష్ అంటున్నారు. వీటికి వ్యతిరేకంగా ఆమె 8ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. తాజాగా WHO ఆమోదం పొందిన ఉత్పత్తులు మాత్రమే ORS పేరును ఉపయోగించాలని FSSAI ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర బ్రాండ్లు ORS లేబుల్ ముద్రించవద్దని సూచించింది.