News December 23, 2025
549 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

స్పోర్ట్స్ కోటాలో 549 కానిస్టేబుల్(GD) పోస్టుల భర్తీకి BSF నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ పాసై, క్రీడల్లో రాణిస్తున్న 18-23 ఏళ్ల మధ్య వయసు గలవారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంది. DEC 27 నుంచి JAN 15 వరకు అప్లై చేసుకోవచ్చు. PST, స్పోర్ట్స్ ప్రదర్శన, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: rectt.bsf.gov.in/
Similar News
News December 24, 2025
మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం మరమ్మతులపై ముందడుగు

TG: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో ఏర్పడిన పగుళ్లు, ఇతర లోపాల మరమ్మతులకు ముందడుగు పడింది. ఈ బ్యారేజీలపై డీపీఆర్‌ను ప్రభుత్వం సిద్ధం చేయిస్తోంది. ఈ పనిని ఆర్వీ అసోసియేట్స్‌కు అప్పగిస్తోంది. అటు తుమ్మిడిహట్టి DPRను కూడా ఇదే సంస్థ రూపొందిస్తోంది. ఈ రిపోర్టును 3నెలల్లో అందించాలని గడువు విధించింది. ఇది రాగానే పనులకు టెండర్లు పిలిచే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.
News December 24, 2025
ఇలాంటి వారితో కలిసి భోజనం చేయకూడదట..

గరుడ పురాణం ప్రకారం.. కొందరి ఇంట్లో భోజనం చేయడం అశుభమని పండితులు చెబుతున్నారు. నేరస్థులు, క్రూరులతో కలిసి ఆహారం తీసుకోకూడదని సూచిస్తున్నారు. ఒకవేళ తీసుకుంటే వారి పాపాల్లో మనం కూడా భాగస్వాములం అవుతామట. అలాగే దేవుడిని విమర్శించేవారు, నాస్తికులతో కూడా కలిసి తినొద్దట. వారి ప్రతికూల ఆలోచనలు మనపై ప్రభావం చూపుతాయని, అవి కష్టాలకు దారితీస్తాయని నమ్మకం. స్వచ్ఛమైన మనసున్నవారి ఇంట్లో భోజనం చేయడం శ్రేయస్కరం.
News December 24, 2025
HALలో 156 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(<


