News February 18, 2025

మహాకుంభమేళాలో 55 కోట్ల మంది స్నానం

image

మహాకుంభమేళాలో మంగళవారం సాయంత్రం వరకు 55 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేసినట్లు UP ప్రభుత్వం వెల్లడించింది. భారత్‌లోని 110 కోట్ల సనాతనుల్లో సగం మంది వచ్చినట్లు పేర్కొంది. FEB 26 నాటికి ఈ సంఖ్య 60 కోట్లు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే, కాశీ విశ్వనాథుని ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ సీజన్లో నిన్నటి వరకు కోటి మందికిపైగా కాశీ సందర్శనకు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.

Similar News

News September 15, 2025

దూబే ఉంటే టీమ్ ఇండియాకు ఓటమి దూరం!

image

టీమ్ ఇండియా క్రికెటర్ శివమ్ దూబే అరుదైన రికార్డు నెలకొల్పారు. వరుసగా 31 టీ20 మ్యాచుల్లో ఓటమెరుగని క్రికెటర్‌గా నిలిచారు. ఆయన ఆడిన గత 31 మ్యాచుల్లో టీమ్ ఇండియా ఒక్క మ్యాచులోనూ ఓడిపోలేదు. ఆసియా కప్‌లో భాగంగా పాక్‌తో నిన్న జరిగిన మ్యాచులోనూ ఈ పరంపర కొనసాగింది. 2020లో న్యూజిలాండ్ సిరీస్ నుంచి ఈ జైత్రయాత్ర కొనసాగుతోంది. 31 మ్యాచుల్లో 25 గెలవగా నాలుగు టై అయ్యాయి. రెండింట్లో ఫలితం తేలలేదు.

News September 15, 2025

రేపు భారీ వర్షాలు

image

ఏపీలోని కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. కాగా ఇవాళ తూ.గో., ప.గో., కాకినాడ, కోనసీమ జిల్లాల్లో వర్షాలు కురిశాయి.

News September 15, 2025

రోడ్డు వేసి 50 ఏళ్లు.. అయినా చెక్కుచెదరలేదు!

image

ప్రస్తుతం రూ.వేల కోట్లతో నిర్మించిన రోడ్లు చిన్న వర్షానికే ధ్వంసమవుతున్నాయి. కానీ 50 ఏళ్ల క్రితం నిర్మించిన ఓ రోడ్డు ఇంకా చెక్కు చెదరకుండా ఉంది. అదే మహారాష్ట్ర పుణేలోని జంగ్లీ మహారాజ్ రోడ్డు(JM రోడ్). దీనిని 1976లో ‘రెకాండో’ అనే నిర్మాణ సంస్థ నిర్మించింది. అధిక నాణ్యత గల పదార్థాలు, సాంకేతికత వాడటంతో 10ఏళ్ల గ్యారెంటీ కూడా ఇచ్చింది. ఇంత నాణ్యమైన రోడ్డు నిర్మించిన ఆ సంస్థకు మరో కాంట్రాక్ట్ ఇవ్వలేదట.