News January 29, 2025
55% మంది ట్రక్కు డ్రైవర్లకు దృష్టి సమస్యలు!

దేశంలో 55% ట్రక్ డ్రైవర్లు దృష్టి సమస్యలతో బాధపడుతున్నట్టు IIT ఢిల్లీ-ఫోర్సైట్ ఫౌండేషన్ సర్వేలో తేలింది. వీరిలో 53% మందికి దూర దృష్టి, 47% మందికి దగ్గరి దృష్టి సమస్యలు ఉన్నట్లు వెల్లడైంది. 44.3% డ్రైవర్లు BMI, 57.4% మంది BP సమస్యలతో బాధపడుతున్నట్టు తేలింది. డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితులు రహదారి భద్రతను ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో తాజా నివేదిక వారి ఆరోగ్య సంరక్షణ అవసరాన్ని నొక్కిచెప్పినట్టైంది.
Similar News
News November 5, 2025
ఈ పరిహారాలు పాటిస్తే.. డబ్బు కొరత ఉండదట

కార్తీక పౌర్ణమి పర్వదినాన రావిచెట్టు ఎదుట దీపారాధన చేస్తే కష్టాలు తొలగి, ఇంట్లో శాంతి, ఆనందం ఉంటాయని పండితులు చెబుతున్నారు. నదిలో దీపం వెలిగిస్తే మోక్షం లభిస్తుంది. పాలు కలిపిన నీటిని తులసి మొక్కకు పోయాలి. విష్ణువుకు తిలకం దిద్ది, నువ్వుల నైవేద్యం పెట్టాలి. నేడు అన్నదానం, వస్త్రదానాలు వంటివి చేస్తే.. పేదరికం నుంచి విముక్తి లభిస్తుంది. డబ్బు కొరతే కాక ఆహారం, నీటి కొరత లేకుండా పోతుందని నమ్మకం.
News November 5, 2025
మగాళ్లకూ పీరియడ్స్ వస్తే అమ్మాయిల బాధ అర్థమవుతుంది: రష్మిక

జగపతి బాబు హోస్ట్గా చేస్తున్న ఓ టాక్ షోలో హీరోయిన్ రష్మిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘మగాళ్లకూ పీరియడ్స్ వస్తే బాగుండేది. అప్పుడు వాళ్లకు మహిళలు అనుభవించే నొప్పి, బాధ, అసౌకర్యం ఏంటో అర్థమయ్యేది’ అని అన్నారు. రష్మిక కామెంట్లపై జగపతి బాబు చప్పట్లు కొట్టి అభినందించారు.
News November 5, 2025
సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సమర్థవంతంగా పనిచేసే క్యాన్సర్ ఔషధం!

నార్త్వెస్టర్న్ యూనివర్సిటీ (US) సైంటిస్టులు కీమోథెరపీ ఔషధాన్ని నానోటెక్నాలజీతో పునఃరూపకల్పన చేసి క్యాన్సర్ చికిత్సలో పెనుమార్పు తీసుకొచ్చారు. దుష్ప్రభావాలు కలిగించే 5-ఫ్లోరోయురాసిల్ (5-Fu) ఔషధాన్ని, స్ఫెరికల్ న్యూక్లియిక్ యాసిడ్ (SNA)గా మార్చారు. ఇది లుకేమియా కణాలను 20,000 రెట్లు ప్రభావవంతంగా నాశనం చేస్తుంది. ఇది ఆరోగ్యకరమైన కణజాలానికి హాని చేయకుండా క్యాన్సర్ కణాలనే లక్ష్యంగా చేసుకుంటుంది.


