News July 11, 2024

మహారాష్ట్రలో 6 నెలల్లో 557మంది రైతుల ఆత్మహత్య

image

మహారాష్ట్రలో గడచిన 6 నెలల్లో 557మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ప్రభుత్వ నివేదిక ప్రకారం అక్కడి అమరావతి పరిపాలన విభాగం పరిధిలోని ఐదు జిల్లాల్లో 500మందికిపైగా కర్షకులు బలవన్మరణం పాలయ్యారు. 53 కేసుల్లో ప్రభుత్వం పరిహారం అందించింది. మరో 284 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రైతన్నల ఆత్మహత్యల వెనుక పంట నష్టం, వర్షాభావం, అప్పుల భారం, సమయానికి పంట రుణం అందకపోవడం వంటి పలు కారణాలున్నాయి.

Similar News

News December 7, 2025

రోహిత్, కోహ్లీలు మళ్లీ ఎప్పుడు కనిపిస్తారంటే?

image

ఇటీవల ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీసుల్లో పరుగుల వరదతో అభిమానులను అలరించిన రో-కో జోడీ మళ్లీ వచ్చే ఏడాది జనవరిలో మైదానంలో అడుగుపెట్టనుంది. జనవరి 11, 14, 18 తేదీల్లో వడోదర, రాజ్‌కోట్, ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు జరగనున్నాయి. ఆ సిరీస్ తర్వాత మళ్లీ జులైలో ENGతో మూడు వన్డేలు ఉన్నాయి. 2027 వన్డే ప్రపంచకప్ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తోన్న రోహిత్, కోహ్లీలు విజయ్ హజారే ట్రోఫీలోనూ ఆడనున్నారు.

News December 7, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

⋆ కాంగ్రెస్ పాలనపై ‘ప్రజా వంచన దినం’ పేరిట HYD ఇందిరాపార్క్ వద్ద బీజేపీ ధర్నా.. హామీలపై చర్చకు రావాలని CM రేవంత్‌కు కిషన్ రెడ్డి సవాల్
⋆ అసెంబ్లీ స్పీకర్‌కు హరీశ్ రావు బహిరంగ లేఖ.. MLAల అనర్హత పిటిషన్లపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్
⋆ ఈనెల 14న రెండో విడత పంచాయతీ ఎన్నికల రోజే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాత పరీక్షనా? CM జోక్యం చేసుకుని పరీక్షను వాయిదా వేయించాలి: కవిత

News December 7, 2025

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌లో ఉద్యోగాలు

image

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(<>UGC<<>>)11 డొమైన్ ప్రొఫెషనల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. జీతం నెలకు రూ.60,000-రూ.70,000వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.ugc.gov.in