Similar News
News April 7, 2026
ఎన్టీఆర్ వైద్య సేవ.. ఆస్పత్రుల సమ్మె విరమణ

AP: రాష్ట్రవ్యాప్తంగా వారం రోజులుగా కొనసాగుతున్న ఎన్టీఆర్ వైద్యసేవ(ఆర్యోగ్రశ్రీ) నెట్‌వర్క్ ఆస్పత్రుల సమ్మె ఇవాళ ముగిసింది. 10 రోజుల్లో రూ.వెయ్యి కోట్ల బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మె విరమించినట్లు స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ వెల్లడించింది. 10 రోజుల్లో డబ్బు చెల్లించకపోతే మళ్లీ వైద్య సేవలను పూర్తిగా నిలిపివేస్తామని హెచ్చరించింది.
News April 7, 2026
వివాదాస్పద పాట.. హీరోయిన్‌పై NCW ఆగ్రహం

పాన్ ఇండియా సినిమా ‘KD: ది డెవిల్’లోని <<19479023>>వివాదాస్పద<<>> పాటలో నటించిన నోరా ఫతేహి, సంజయ్‌దత్‌లకు ఇటీవల NCW(జాతీయ మహిళా కమిషన్) నోటీసులు ఇచ్చింది. అయితే నిన్న జరిగిన విచారణకు నోరా తరఫున లాయర్ హాజరుకావడంపై కమిషన్ మండిపడింది. ఆమె ఈ నెల 27న వ్యక్తిగతంగా హాజరుకావాలని చివరి అవకాశం ఇచ్చింది. సంజయ్ రేపు విచారణ ఎదుర్కోవాలని ఆదేశించింది. ఈ పాటపై డైరెక్టర్ ప్రేమ్, రచయిత, నిర్మాత క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే.
News April 7, 2026
ఇరాన్ భయంతో బహ్రెయిన్‌ను కలిపే బ్రిడ్జిని మూసేసిన సౌదీ

ఇరాన్ తమ దేశంలోని బ్రిడ్జిలపై దాడి చేస్తుందనే భయంతో సౌదీ అప్రమత్తమైంది. ముందుజాగ్రత్తగా బహ్రెయిన్‌కు వెళ్లే కింగ్ ఫాద్ కాజ్‌వే బ్రిడ్జిని మూసేసింది. ఈ 25 KM బ్రిడ్జి సౌదీని బహ్రెయిన్‌ను కలుపుతుంది. 1986లో ప్రారంభించగా రోజుకు 90వేల మంది దీనిపై ప్రయాణిస్తారు. కాగా US ఇరాన్‌లోని B-1 <<19566834>>బ్రిడ్జిని<<>> పేల్చేసిన సంగతి తెలిసిందే. దీంతో గల్ఫ్ దేశాల్లోని వంతెనలను పేల్చేస్తామని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది.



