News September 26, 2024
రెండో విడతలో 56శాతం పోలింగ్ నమోదు

జమ్మూకశ్మీర్లో రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 56% ఓటింగ్ నమోదైందని, ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పీకే పోల్ తెలిపారు. శ్రీమాతా వైష్ణోదేవీ సీటులో అత్యధికంగా 75.29% పోలింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు. 72.71% పోలింగ్తో పూంచ్ హవేలీ రెండో స్థానంలో నిలిచింది. SEP 18న జరిగిన తొలి విడతలో 59% పోలింగ్ నమోదైంది. మూడో విడత OCT 1న జరగనుంది. 8వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి.
Similar News
News September 16, 2025
కోహ్లీ బయోపిక్ డైరెక్ట్ చేయను: అనురాగ్ కశ్యప్

కోహ్లీ అంటే అభిమానం ఉన్నా ఆయన బయోపిక్కు తాను దర్శకత్వం వహించనని డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ అన్నారు. కోహ్లీ అంటే అందరికీ ఇష్టమని, ఆయనొక అద్భుతమని కొనియాడారు. ఒకవేళ ఎవరిదైనా బయోపిక్ చేయాల్సి వస్తే కష్టమైన సబ్జెక్ట్నే ఎంచుకుంటానని తెలిపారు. సాధారణ వ్యక్తి జీవితాన్ని తెరపై చూపిస్తానని పేర్కొన్నారు. కాగా అనురాగ్ తెరకెక్కించిన ‘నిషాంచి’ మూవీ ఈ నెల 19న రిలీజ్ కానుంది.
News September 16, 2025
భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ప్రారంభం

భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ప్రారంభమయ్యాయి. మన దేశంపై ట్రంప్ 50శాతం టారిఫ్లు విధించిన తర్వాత తొలిసారి ఈ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఇరుదేశాల మధ్య ఐదు విడతల్లో సమావేశాలు జరిగాయి. ద్వైపాక్షిక వాణిజ్య అంశాలపై చర్చించేందుకు అమెరికా ప్రతినిధి బ్రెండన్ లించ్ ఇప్పటికే భారత్కు వచ్చిన విషయం తెలిసిందే.
News September 16, 2025
శ్రీవారి పాదాల చెంత ఘోర అపచారం: భూమన

AP: శ్రీవారి పాదాల చెంత ఘోర అపచారం జరిగిందని YCP నేత భూమన కరుణాకర్ రెడ్డి వాపోయారు. ‘అలిపిరిలో మలమూత్రాలు విసర్జించే చోట, మద్యం బాటిల్స్ మధ్య శ్రీ మహావిష్ణువు విగ్రహం పడి ఉంది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా, హైందవ ధర్మానికి తూట్లు పొడిచేలా టీటీడీ తీరు ఉంది. బీఆర్ నాయుడు టీటీడీ ఛైర్మన్ అయిన తర్వాత వరుసగా ఘోర అపచారాలు జరుగుతున్నాయి. హిందూ సంఘాలన్నీ వ్యతిరేకించాల్సిన సమయం వచ్చింది’ అని పేర్కొన్నారు.