News July 16, 2024

image

https://sticky.way2news.co/sticky_jsps/Quiz3.jsp?id=321&langid=1&token={TOKEN}

Similar News

News January 9, 2026

అమరావతిలో 3500 టన్నుల కంచుతో భారీ NTR విగ్రహం

image

AP: రాజధాని అమరావతి ప్రాంతంలోని నీరుకొండలో సుమారు 3500 టన్నుల కంచుతో భారీ NTR విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన డిజైన్లను క్యాబినెట్ సబ్‌ కమిటీ పరిశీలించింది. విగ్రహంతోపాటు స్మృతివనం డిజైన్లను ఫైనలైజ్ చేసేందుకు ప్రభుత్వం సబ్‌ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టును అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (AGICL) పర్యవేక్షించనుంది.

News January 9, 2026

హోమ్‌లోన్ చెల్లించిన తర్వాత ఇవి మర్చిపోవద్దు

image

హోమ్‌ లోన్‌ తీసుకున్న వారు పూర్తిగా చెల్లించిన తరువాత రిలాక్స్‌ కాకుండా కొన్ని పనులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంకు వద్ద ఉండే టైటిల్ డీడ్, సేల్ డీడ్, లోన్ అగ్రిమెంట్, పవర్ ఆఫ్ అటార్నీ వంటి ఆస్తి పత్రాలను తిరిగి పొందాలి. అదే విధంగా తప్పనిసరిగా నో డ్యూ సర్టిఫికెట్ తీసుకోవాలి. చివరగా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆస్తి తనఖా నుంచి బ్యాంకు హక్కును తీసివేయాలి. దీంతో ఇల్లు మీ చేతుల్లోకి వస్తుంది.

News January 9, 2026

వీళ్లెవరండీ బాబూ.. స్పీడ్ బ్రేకర్లను ఎత్తుకెళ్లారు

image

MPలోని విదిశ(D)లో ఓ వింతైన దొంగతనం జరిగింది. ఇటీవల రూ.8 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లను దొంగలు రాత్రికి రాత్రే మాయం చేశారు. మెయిన్ రోడ్డు, దుర్గా నగర్ చౌక్, డిస్ట్రిక్ట్ కోర్టు, వివేకానంద చౌక్ మధ్య ప్రాంతాల నుంచి వీటిని ఎత్తుకెళ్లారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లోనే ఈ చోరీ జరగడంతో విమర్శలు వస్తున్నాయి. స్పీడ్ బ్రేకర్లే సురక్షితంగా లేకపోతే తమ భద్రత ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.