News October 21, 2025

5,800 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

image

రైల్వేలో 5,800 నాన్ టెక్నికల్ పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిగ్రీ అర్హతతో 18నుంచి 33ఏళ్లు గల అభ్యర్థులు నవంబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. 3,050 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్ పాసైన18 నుంచి 30 ఏళ్లు గల అభ్యర్థులు ఈనెల 28 నుంచి నవంబర్ 27వరకు దరఖాస్తు చేయవచ్చు. వెబ్‌సైట్: https://www.rrbcdg.gov.in/

Similar News

News October 21, 2025

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 50 మేనేజర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, CA/CMA/CS/CFA, డిప్లొమా(ఫైనాన్స్ ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, SC, ST, PWBDలకు రూ.175. *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News October 21, 2025

ప్రసారభారతిలో 59 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>ప్రసారభారతి<<>> 59పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. యాంకర్ కమ్ కరస్పాండెంట్, కంటెంట్ ఎగ్జిక్యూటివ్, కాపీ ఎడిటర్, కాపీ రైటర్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ, జర్నలిజం, పీజీ డిప్లొమాతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వీటిని భర్తీ చేయనున్నారు. అభ్యర్థులను పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://prasarbharati.gov.in/

News October 21, 2025

స్వాతంత్య్ర సంగ్రామంలో సువర్ణ అధ్యాయం: ఆజాద్ హింద్ ఫౌజ్

image

భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో ఈరోజు ఎంతో కీలకం. 1943లో సరిగ్గా ఇదే రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్ సింగపూర్‌లో ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించి, తాత్కాలిక స్వతంత్ర ప్రభుత్వాన్ని ప్రకటించారు. నేతాజీ నాయకత్వంలో వేలాది మంది సైనికులు దేశం కోసం తుదిశ్వాస వరకు పోరాడారు. ‘చలో ఢిల్లీ’ నినాదంతో బ్రిటిష్ పాలకుల గుండెల్లో భయం పుట్టించిన ఈ సైన్యం సాహసాన్ని మరోసారి గుర్తుచేసుకుందాం. *జై హింద్