News September 1, 2024
59 పునరావాస కేంద్రాల ఏర్పాటు: HYD కలెక్టర్

రానున్న రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని HYD కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. సోమవారం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. ఇప్పటికే 59 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Similar News
News November 14, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. ప్రతి ఓటు కీలకమే..!

ప్రతిష్ఠాత్మక జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్, BRS మధ్య థగ్ ఆఫ్ వార్ పోటీ నేపథ్యంలో ప్రతి ఒక్క ఓటు కీలకం కానుంది. యూసుఫ్గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో 42 టేబుల్స్పై 10 రౌండ్లలో కౌంటింగ్ జరగనుండగా ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం 4,01,365 ఓట్లు ఉండగా అందులో 1,94,631 మంది ఓటేశారు. ఏ పార్టీ గెలిచినా మెజార్టీ ఎక్కువ ఉండదనే చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్?
News November 14, 2025
జూబ్లీహిల్స్ కౌంటింగ్: NOTAతో కలిపి 59 మంది.. ECI స్పెషల్ పర్మిషన్

జూబ్లీహిల్స్లో నోటాతో కలిపి 59 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ECI నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని ఈ సారి కౌంటింగ్ కోసం 42 టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియను సాధారణ పరిశీలకులు, ECI బృందం పరిశీలించనుంది. మొత్తం కౌంటింగ్ ప్రక్రియకు 186 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, కౌంటింగ్ మైక్రో అబ్జర్వర్స్ ఉంటారు.
News November 14, 2025
జూబ్లీ కౌంటింగ్: దద్దరిల్లనున్న హైదరాబాద్

రాజకీయాల్లో ఉత్కంఠగా మారిన ఫలితం నేడు వెలువడనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజేత ఎవరు? అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపు చూపినా.. కొన్ని సర్వేలు BRSకు అనుకూలంగా వచ్చాయి. ఇవి ఎగ్జాక్ట్ కాకపోయినా పోలింగ్లో సైలెంట్ ఓటింగ్ కీలకంగా మారింది. మధ్యాహ్నం లోపు విజయం తేలనుండడంతో సంబరాలకు శ్రేణులు సన్నద్ధం అవుతున్నాయి. ఎవరు గెలిచినా నగరం హోరెత్తనుంది.


