News October 9, 2025
ప్రసారభారతిలో 59 ఉద్యోగాలు

ప్రసారభారతి 59పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. యాంకర్ కమ్ కరస్పాండెంట్, కంటెంట్ ఎగ్జిక్యూటివ్, కాపీ ఎడిటర్, కాపీ రైటర్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ, జర్నలిజం, పీజీ డిప్లొమాతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 21వరకు అప్లై చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వీటిని భర్తీ చేయనున్నారు. అభ్యర్థులను పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://prasarbharati.gov.in/
Similar News
News October 9, 2025
IGMCRI 226 పోస్టులకు నోటిఫికేషన్

ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ& రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 226 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు NOV 6వరకు అప్లై చేసుకోవచ్చు. నర్సింగ్ డిగ్రీ, డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్, మిడ్ వైఫరీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు 18 -35ఏళ్ల మధ్య ఉండాలి. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.250, SC, STలకు రూ.125. వెబ్‌సైట్: https://igmcri.edu.in/
News October 9, 2025
దీపావళి ఏ రోజు జరుపుకోవాలంటే?

అక్టోబర్ 20, 21 తేదీల్లో అమావాస్య తిథి ఉండటంతో.. ఈ ఏడాది దీపావళి ఏ రోజు జరుపుకోవాలన్న గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రముఖ పండితుల సంస్థ ‘కాశీ విద్వత్ పరిషత్’ దీనిపై క్లారిటీ ఇచ్చింది. దీపావళి పండుగను అక్టోబర్ 20వ తేదీన జరుపుకోవాలని స్పష్టం చేసింది. పూర్తి ప్రదోషకాలం (5.46 PM-8.18 PM)ఆరోజు ఉంటుందని వెల్లడించింది. లక్ష్మీపూజ కూడా అదే రోజు రా.7.08-రా.8.18 మధ్య జరుపుకోవచ్చని తెలిపింది.
News October 9, 2025
లక్షల కోట్లు బూడిద చేశాడు

US కాలిఫోర్నియా సమీపంలోని పసిఫిక్ పాలిసేడ్స్‌లో చెలరేగిన కార్చిచ్చు ఉద్దేశపూర్వకంగా సృష్టించిందని అధికారులు వెల్లడించారు. ఈ కేసులో 29 ఏళ్ల జొనాథన్ రిండర్‌నెక్ట్‌ను అరెస్టు చేశారు. ఈ ఏడాది జనవరి 1న అతను పెట్టిన మంట లాస్ ఏంజెలిస్ చరిత్రలోనే భారీ అగ్నిప్రమాదంగా మారింది. ఈ మంటలకు 12 మంది ప్రాణాలు కోల్పోగా, 6,800 కట్టడాలు బూడిదయ్యాయి. దాదాపు 150 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.