News June 19, 2024

ఇంటర్ సప్లిమెంటరీలో 59శాతం ఉత్తీర్ణత

image

AP: ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాల్లో 59% ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 1,27,190 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 74,868 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 42,200 మంది బాలురు, 32,668 మంది బాలికలున్నారు. ఉత్తీర్ణతలో 84%తో పార్వతీపురం మన్యం జిల్లా తొలి స్థానంలో ఉండగా, 41 శాతంలో ప.గో చివరి స్థానంలో ఉంది. కాగా ఈ నెల 26న ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలను వెల్లడిస్తారు.

Similar News

News February 3, 2025

బీసీల మేలు కోసం చేసే ప్రయత్నాలను అడ్డుకోవద్దు: మంత్రి

image

TG: <<15340893>>కులగణనపై<<>> సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ‘కులగణనపై రాజకీయ విమర్శలు చేయడం సరికాదు. ఈ విమర్శలను బీసీలపై దాడిగానే చూస్తాం. కొందరు సర్వేకు సహకరించలేదు. కేసీఆర్ కుటుంబం నుంచి కవిత ఒక్కరే వివరాలు ఇచ్చారు. కాస్ట్ సెన్సస్ డీటెయిల్స్ అన్నీ పబ్లిక్ డొమైన్‌లో పెడతాం. బీసీల మేలు కోసం చేసే ప్రయత్నాలను అడ్డుకోవద్దు’ అని కోరారు.

News February 3, 2025

ఆ రైలు ఎంత లేటుగా వచ్చిందో తెలుసా!

image

నీవెక్కదలచిన రైలు ఒక జీవితకాలం లేటు అన్నారో సినీకవి. నిత్యం లక్షలాదిమందితో వేలాది గమ్యస్థానాల మధ్య ప్రయాణించే రైళ్ల రాకపోకల్లో ఆలస్యం అర్థం చేసుకోదగినదే. కానీ మరీ 72 గంటల లేటైతే? అనధికారిక వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని కోటా నుంచి పట్నా వెళ్లాల్సిన 13228 నంబర్ రైలు 2017లో 72 గంటలు లేటుగా వచ్చింది! రైల్వే అధికారిక వివరాల ప్రకారం ఆ చెత్త రికార్డు మహానంద ఎక్స్‌ప్రెస్ (2014లో 71 గంటలు) పేరిట ఉంది.

News February 3, 2025

వావ్ రూ.1499 విమాన టికెట్

image

ఎయిర్ ఇండియా ‘నమస్తే వరల్డ్ సేల్’ లో భాగంగా రూ.1499 విమాన ప్రయాణం కల్పించనుంది. దేశీయ ఎకానమీ క్లాస్ టికెట్స్ రూ.1499, ప్రీమియం ఎకానమీ రూ.3,749 కు ప్రారంభంకానున్నాయి. బిజినెస్ క్లాస్ టికెట్ ధర రూ.9,999 మెుదలవుతాయి. ఈ నెల6వరకూ బుకింగ్స్ చేసుకోవచ్చు. ఎయిర్ఇండియా అధికారిక వెబ్‌సైట్, యాప్‌లలో బుక్ చేసుకున్నవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఫిబ్రవరి12 నుంచి అక్టోబర్31తేదీలలో ప్రయాణించవచ్చు.