News June 26, 2024
ముగిసిన 5జీ స్పెక్ట్రమ్ వేలం.. కేంద్రానికి ₹11వేలకోట్ల రెవెన్యూ

కేంద్రం నిన్న ప్రారంభించిన 5జీ స్పెక్ట్రమ్ వేలం ఈరోజు ముగిసింది. ఏడు రౌండ్లు జరగగా భారతీ ఎయిర్టెల్ ఎక్కువ బ్యాండ్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 900 MHz, 1800 MHz, 2100 MHz బ్యాండ్లకు డిమాండ్ నెలకొందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. 800 MHz, 2500 MHz, 26 GHz, 3.3 GHz బ్యాండ్లపై ఎవరూ ఆసక్తి కనబరచలేదని తెలిపాయి. కాగా ఈ ఆక్షన్ ద్వారా కేంద్రానికి ₹11,300కోట్ల నికర ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది.
Similar News
News November 19, 2025
రేపు సీబీఐ కోర్టుకు జగన్

AP: అక్రమాస్తుల కేసుకు సంబంధించి మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుకానున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని కోర్టుకు ఉదయం 11.30 గంటలకు వస్తారని తెలుస్తోంది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న జగన్ అభ్యర్థనను సీబీఐ వ్యతిరేకించింది. దీంతో ఈ నెల 21 లోగా వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒక రోజు ముందే వచ్చేందుకు ఆయన సిద్ధమయ్యారని సమాచారం.
News November 19, 2025
మానవ రూపంలో గణేషుడ్ని చూశారా?

మనందరికీ ఏనుగు తలతో కూడిన గణపతి మాత్రమే తెలుసు. కానీ ఆయన మానవ రూపంలో ఎలా ఉంటారో చాలామందికి తెలీదు. అయితే వినాయకుడు నరుడిగా దర్శనమిచ్చే ఆలయం తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ ఆది వినాయకుడిగా పూజలందుకునే స్వామివారికి త్రేతా యుగంలో రాములవారు పూజలు నిర్వహించినట్లు స్థల పురాణం చెబుతోంది. అప్పుడు రాముడు సమర్పించిన పిండాలు 4 శివలింగాలుగా మారాయట. వాటినీ ఈ ఆలయంలో చూడవచ్చు. <<-se>>#Temple<<>>
News November 19, 2025
నేటి సామెత.. ‘అదునెరిగి సేద్యం, పదునెరిగి పైరు’

సమయం చూసి వ్యవసాయం చేయాలి. అంటే, వాతావరణ పరిస్థితులు, భూమి స్వభావం, నీటి లభ్యత వంటి అంశాలను పరిశీలించి సాగును ప్రారంభించాలి. భూమికి, వాతావరణానికి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే పంటను వెయ్యాలి. సమయం దాటితే పంట చేతికి రాదు, శ్రమ కూడా వృథా అవుతుంది. అలాగే ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే సమయాన్ని సరిగ్గా అంచనా వేసి, సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పడం ఈ సామెత ఉద్దేశం.


