News April 13, 2025
5MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించిన మంత్రి

కాటారం మండలం ధన్వాడ సబ్ స్టేషన్లో వేసవి కాలంలో పెరుగుతున్న లోడ్ కోసం, అదనపు 5MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ను రూ.కోటితో అంచనా వేసి, ఆ ట్రాన్స్ఫార్మర్ పనులు ఇటీవల పూర్తి చేశారు. ఆదివారం రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా, మండల విద్యుత్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Similar News
News December 4, 2025
సల్మాన్ ఖాన్ రాక.. కీరవాణి రాగం

TG గ్లోబల్ సమ్మిట్‌కు సినీ గ్లామర్ తోడవనుంది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సదస్సుకు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు కన్ఫర్మ్ చేశాయి. సినీ ఇండస్ట్రీపై చర్చలో ఆయన పాల్గొంటారు. అటు ఈవెంట్ మొదట్లో ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ కీరవాణి కన్సర్ట్ ఉండనుంది. సుమారు గంటన్నరపాటు ఆయన తన సంగీతంతో ఆకట్టుకోనున్నారు. బంజారా, కోలాటం, గుస్సాడీ, భారతనాట్యం వంటి కల్చరల్ ప్రోగ్రామ్‌లు అతిథులను అలరించనున్నాయి.
News December 4, 2025
HYD: కేటీఆర్ పర్యటనలో కెమెరామెన్ మృతి

కేటీఆర్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. విడియో తీస్తుండగా గుండె నొప్పితో ఆజ్ తక్ ఛానల్ కెమెరామెన్ దామోదర్ కుప్పకూలారు. గమనించిన పోలీసులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దామోదర్ మృతి చెందారు. మృతదేహం గాంధీ మార్చరికి తరలించారు.