News April 13, 2025
5MVA పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించిన మంత్రి

కాటారం మండలం ధన్వాడ సబ్ స్టేషన్‌లో వేసవి కాలంలో పెరుగుతున్న లోడ్ కోసం, అదనపు 5MVA పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను రూ.కోటితో అంచనా వేసి, ఆ ట్రాన్స్‌ఫార్మర్ పనులు ఇటీవల పూర్తి చేశారు. ఆదివారం రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా, మండల విద్యుత్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Similar News
News April 15, 2025
కొండగట్టు: చిన్న జయంతికి వచ్చిన ఆదాయం రూ.1,67,73,800

కొండగట్టు చిన్న జయంతికి వివిధ టికెట్ల ద్వారా దేవాలయానికి రూ.1,67,73,800 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. లడ్డు, పులిహోర ప్రసాదాల ద్వారా రూ.97,16,800, దీక్ష విరమణల ద్వారా రూ.40,17,500, కేశఖండన ద్వారా రూ.11,78,000, శీఘ్ర దర్శనం ద్వారా రూ. 18,61,500 లభించినట్లు తెలిపారు. అలాగే చిన్న జయంతి ఉత్సవాల్లో పాల్గొని సేవలందించిన ప్రతి ఒక్కరికి దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.
News April 15, 2025
ఆ విషయంలో ప్రభుత్వం తోక ముడవడం ఖాయం: తాటిపర్తి

AP: వైసీపీ హయాంలో విద్యుత్ ఒప్పందాలు, లిక్కర్ పాలసీలపై కూటమి ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు ఆ పార్టీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కౌంటరిచ్చారు. ‘అదానీ దగ్గర రూ.1,750 కోట్లు లంచం తీసుకుని విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం చేసుకున్నారని మాపై విమర్శలు చేసి తోక ముడిచారు. ఇప్పుడు మద్యం కుంభకోణం అంటూ మరోసారి విష ప్రచారం చేసి తోక ముడుస్తారు’ అని Xలో పోస్టు చేశారు.
News April 15, 2025
గార : పోరుబందరు పోర్ట్‌లో మత్యకారుడు అదృశ్యం

గార మండలం మోగదాలపాడుకు చెందిన మత్స్యకారుడు పుక్కళ్ల సిద్ధార్థ (సర్దార్) (44) చేపలు వేట కోసం గుజరాత్‌లోని పోరుబందరు వెళ్లి అదృశ్యమయ్యారు. ఏప్రిల్ 8వ తేదీన వేట పూర్తైన తరువాత రూమ్‌కి రాలేదని బోట్ డ్రైవర్ గురుమూర్తి మంగళవారం తెలిపారు. అప్పటి నుంచి వెతికామని ఆయన కానరాలేదన్నారు. సిద్ధార్థకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.