News November 4, 2024
5న ప్రకాశం జిల్లా వైసీపీ విస్తృత స్థాయి సమావేశం
ఒంగోలులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద రెడ్డి చెప్పారు. సమావేశానికి పార్టీ జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, ఒంగోలు పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొంటారన్నారు. జిల్లాలోని నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు, అన్ని కమిటీలతో సమావేశం నిర్వహిస్తారని పేర్కొన్నారు.
Similar News
News December 26, 2024
శానంపూడిలో యువతి ఆత్మహత్య
సింగరాయకొండ మండలంలో నవ వధువు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. పాలపర్తి అమూల్య అనే యువతికి శానంపూడి గ్రామానికి చెందిన తగరం గోపీ కృష్ణతో 40 రోజుల క్రితం వివాహం జరిగింది. గురువారం అమూల్య ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అత్తింటి వేధింపులు భరించలేకే యువతి ఆత్మహత్య చేసుకుందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 26, 2024
బాపట్ల: రేపు ఎస్టీలకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్
బాపట్ల జిల్లాలో ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం శుక్రవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. శుక్రవారం ఉదయం 10:30 గంటలకు కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ సెల్ జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రత్యేక గ్రీవెన్స్‌ను జిల్లాలోని ఎస్టీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News December 26, 2024
REWIND: ‘ప్రకాశం జలప్రళయానికి 35 మంది బలి
సునామీ ఈ పేరు వింటేనే ప్రకాశం జిల్లాలోని తీర ప్రాంత గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2004 డిసెంబర్ 26న ప్రకాశం జిల్లాలో సునామీ పంజా విసిరింది. ఈ ధాటికి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 35 మంది మృతి చెందారు. కళ్లెదుటే కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న పరిస్థితులను ఇప్పుడు తలచుకుంటే.. ఆ భయం అలానే ఉందని జిల్లా వాసులు పేర్కొంటున్నారు.