News November 3, 2024

6న టీటీడీ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం..?

image

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి 29 మందితో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 6వ తేదీన టీటీడీ ఛైర్మన్‌గా బిఆర్ నాయుడు సహా పలువురు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. టీటీడీ అధికారులు నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఎవరెవరు వస్తారు, ఏ రోజు వస్తారు అనేది పూర్తి స్థాయిలో వెల్లడించాలని టీటీడీ అధికారులు ఇప్పటికే సభ్యులకు తెలియజేసినట్లు తెలుస్తుంది.

Similar News

News September 14, 2025

పెద్దపంజాణి: 8 మంది అరెస్ట్

image

పెద్దపంజాణి మండలంలోని రాజుపల్లి సమీపంలో పేకాట ఆడుతున్న 8 మందిని శనివారం అరెస్టు చేసినట్లు ఎస్ఐ ధనుంజయరెడ్డి తెలిపారు. రాజుపల్లి సమీపంలో పలువురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే రహస్య సమాచారం మేరకు తన సిబ్బందితో కలిసి పేకాట శిబిరంపై దాడి చేశామన్నారు. అక్కడ 8 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.16,250 స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News September 13, 2025

చిత్తూరు SP మణికంఠ చందోలు బదిలీ

image

చిత్తూరు SP మణికంఠ చందోలు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో బాపట్లలో పని చేస్తున్న తుషార్ డూడీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల SPలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

News September 13, 2025

బార్లకు దరఖాస్తు గడువు పొడిగింపు.. 17 లాస్ట్

image

చిత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని 6 బార్లకు ఈనెల 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు పొడిగించినట్లు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 6 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.18వ తేదీ ఉదయం 8 గంటలకు కలెక్టరేట్లోని DRDA సమావేశ మందిరంలో లాటరీ పద్ధతిలో బార్‌ల కేటాయింపు జరుగుతుందన్నారు.