News May 4, 2024
6న మాచర్లకు సీఎం జగన్

సీఎం జగన్ ఈ నెల 6న మాచర్లలో పర్యటించనున్నట్లు వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు పిన్నెల్లి వెంకట రామిరెడ్డి శనివారం తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరగబోయే ‘మేమంతా సిద్ధం’ సభకు సీఎం వస్తున్నారని చెప్పారు. ఈ సభలో కార్యకర్తలు, నాయకులు విచ్చేసి సభను జయప్రదం చేయాలని కోరారు.
Similar News
News December 21, 2025
జిల్లాలో తొలిరోజే 97.9% పోలియో చుక్కల పంపిణీ: DMHO

గుంటూరు జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం తొలిరోజు విజయవంతమైంది. నిర్దేశించిన 2,14,981 మంది చిన్నారులకు గాను 2,08,735 (97.9%) మందికి చుక్కలు వేసినట్లు DMHO విజయలక్ష్మీ తెలిపారు. మురికివాడలు, ప్రమాదకర ప్రాంతాల్లోని 2,434 మందికి, ప్రయాణాల్లో ఉన్న 1,474 మందికి కూడా మందు వేశారు. ఆదివారం కేంద్రాలకు రాని పిల్లల కోసం సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేస్తామని ఆమె పేర్కొన్నారు.
News December 21, 2025
డ్రగ్స్ దేశ భద్రతకే ముప్పు: ఆకే రవికృష్ణ

డ్రగ్స్ వినియోగం కేవలం ఆరోగ్యానికే కాకుండా దేశ భద్రతకు కూడా ముప్పు అని ఏపీ ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ హెచ్చరించారు. గుంటూరులో నిర్వహించిన ‘రోటోఫెస్ట్-2025’లో ఆయన పాల్గొని ప్రసంగించారు. యువత క్రమశిక్షణతో ఉంటూ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. మాదకద్రవ్యాల కదలికలపై అనుమానం వస్తే వెంటనే 1972 నంబర్కు సమాచారం అందించాలని ఐజీ పిలుపునిచ్చారు.
News December 21, 2025
ANU బీటెక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ(ANU) పరిధిలోని కాలేజీలలో బీటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ, 2వ ఏడాది రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు 2026 జనవరి 21 నుంచి నిర్వహిస్తామని..ఈ పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా ఈ నెల 29లోపు, రూ.100 ఫైన్తో 30లోపు ఫీజు చెల్లించాలని ANU సూచించింది. వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని కోరింది.


