News May 3, 2024

6న రాజమండ్రికి ప్రధాని మోదీ రాక

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6వ తేదీన ప్రధాన మోదీ రాజమండ్రిలో పర్యటించనున్నారు. కడియం మండలంలోని వేమగిరి జాతీయ రహదారిపై కూటమి ఆధ్వర్యంలో విజయ శంఖారావం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో ప్రధానితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.  

Similar News

News December 8, 2025

రాజమండ్రి: నేడు PGRS కార్యక్రమం

image

డిసెంబర్ 8న (సోమవారం) జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్ నుంచి సచివాలయాల వరకు PGRS కార్యక్రమం యథాతథంగా జరుగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పౌర సేవల కోసం వాట్సాప్ నంబర్ 95523 00009 అందుబాటులో ఉందని తెలిపారు. ఫిర్యాదుదారులు దీనిని వినియోగించుకోవాలని ఆమె సూచించారు.

News December 7, 2025

రౌడీషీటర్లకు ఎస్పీ హెచ్చరిక

image

తూర్పుగోదావరి ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆదేశాలతో ఆదివారం జిల్లావ్యాప్తంగా రౌడీషీటర్లు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎస్‌హెచ్‌ఓల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేరస్తుల ప్రవర్తనపై ఆరా తీశారు. అందరూ సత్ప్రవర్తనతో మెలగాలని, మళ్లీ చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాల్లో భాగస్వాములైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.