News May 4, 2024
6వ తేదీ నుంచి హోం ఓటింగ్ ప్రక్రియ మొదలు: కలెక్టర్

మంచానికే పరిమితమై ఇంట్లో నుంచి బయటకు రావటానికి వీల్లేని వృద్ధులు, దివ్యాంగులకు ఎన్నికల సంఘం కల్పించిన హోమ్ ఓటింగ్ ప్రక్రియను జిల్లాలో ఈ నెల 6, 7, 8వ తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ జీ.సృజన శనివారం తెలిపారు. ఆలూరు నియోజకవర్గంలో 228 మంది, మంత్రాలయం 78, ఆదోని 63, కర్నూలు 53, పాణ్యం 159, పత్తికొండ 118, కోడుమూరు 127, ఎమ్మిగనూరులో 171 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.
Similar News
News February 9, 2026
కర్నూలు: ‘37 ఏళ్ల తర్వాత ఒక్కటయ్యారు’

కర్నూలు(D) వెల్దుర్తి జడ్పీ హైస్కూల్ (1988-89 బ్యాచ్) 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. దాదాపు 100 మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆనందంగా గడిపారు. అలాగే పలు కారణాలతో మృతి చెందిన మిత్రులకు మౌనం పాటించి, నివాళులర్పించారు. వివిధ రంగాల్లో స్థిరపడిన మిత్రులను ఘనంగా సన్మానించారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులు స్మరించున్నారు.
News February 9, 2026
కర్నూలు: టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. రేపు ఇంటర్వ్యూ!

ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 10న (మంగళవారం) జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఆనంద్ రాజ్ కుమార్ తెలిపారు. 11 కంపెనీలు పాల్గొంటాయన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, ఫార్మసీ చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. వయసు 18-35 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని చెప్పారు.
News February 9, 2026
103 మంది విద్యార్థులు హాజరు కాలేదు: లాలప్ప

జిల్లా వ్యాప్తంగా 61 పరీక్షా కేంద్రాలలో ఆదివారం జరిగిన ఇంటర్ జనరల్, ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప వెల్లడించారు. ఉదయం జరిగిన ప్రథమ సంవత్సరంలో 2,721 మంది విద్యార్థులు హాజరవ్వగా.. 82 మంది గైర్హాజరయ్యారన్నారు. మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరంలో 1,968 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని, 21 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదని పేర్కొన్నారు.


